ETV Bharat / sports

జడ్డూ 'కత్తి విన్యాసం'.. అదిరిపోయింది గురూ!

కరోనా లాక్​డౌన్​ కారణంగా క్రీడాకారులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారికి నచ్చిన వ్యాపకాలతో సమయాన్ని గడుపుతున్నారు. టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా మాత్రం కత్తి విన్యాసంతో ఆకట్టుకుంటున్నాడు. దీనిపై పలువురు క్రికెటర్లతో సహా నెటిజన్లు స్పందించారు.

author img

By

Published : Apr 13, 2020, 11:05 AM IST

Watch Ravindra Jadeja's Sword wielding viral video
'కత్తి పదును కోల్పోయినా.. గురువు మాట వింటుంది'

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మైదానంలో ఎలా మాయచేస్తాడో అందరికీ తెలుసు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అద్భుత విన్యాసాలు చేస్తుంటాడు. జడ్డూ మైదానంలోనే కాకుండా ఇంట్లోనూ అప్పుడప్పుడు విన్యాసాలు చేస్తుంటాడు. ప్రస్తుతం ఇంట్లో ప్రదర్శించిన కత్తి విన్యాసంతో నెటిజెన్లను 'వావ్‌' అనిపిస్తున్నాడు. సహజంగా మైదానంలో అర్ధశతకం, శతకం చేసినప్పుడు జడ్డూ తన బ్యాట్‌ను కత్తి తిప్పినట్లు తిప్పడం మనం ఎన్నోసార్లు చూశాం. అలాంటిదే ఇప్పుడు నిజమైన కత్తితో ప్రదర్శన చేశాడు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమవ్వగా కొందరు కుటుంబసభ్యులతో హాయిగా జీవిస్తున్నారు. మరికొందరు ఇంట్లో పనులు చేస్తూ బిజీగా ఉంటున్నారు. జడేజా మాత్రం జామ్‌నగర్‌లోని తన ఇంట్లో ఆదివారం కత్తితో విన్యాసాలు చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. "కత్తి తన మెరుపును కోల్పోవచ్చు కానీ, గురువు మాటను కాదనదు" అని పేర్కొన్నాడు.

అది చూసిన ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ కామెంట్‌ చేశాడు. "ఇప్పుడు నీ గడ్డిని కత్తిరించడానికి యంత్రం కావాలి" అని సరదాగా వ్యాఖ్యానించాడు. జడేజా విన్యాసం చూసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. గతేడాది ఐపీఎల్‌ షూట్‌లో భాగంగా జడేజా లాగే బ్యాట్‌ తిప్పే ప్రయత్నం చేశాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ వార్నర్‌.. "నేను కూడా జడ్డూలాగే బ్యాట్‌ తిప్పానా?" అని నెటిజెన్ల అభిప్రాయం కోరాడు.

ఇదీ చూడండి.. విరామం వచ్చినా బంతిని బాదడంలో మార్పులేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.