ETV Bharat / sports

'తండ్రిని కాబోతున్న ఆనందం మాటల్లో చెప్పలేను' - తండ్రి కాబోతుండటంపై కోహ్లీ

తండ్రిగా మారబోతుండటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ. ప్రస్తుతం తనకు చంద్రుడిపై ఉన్నంత హాయిగా ఉందని చెప్పాడు. అందమైన ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనన్నాడు.

Kohli
కోహ్లీ
author img

By

Published : Sep 4, 2020, 6:03 AM IST

కోహ్లీ

తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయం తెలిసినప్పటి నుంచి భార్య అనుష్క శర్మ, తానూ చంద్రుడిపై తేలియాడుతున్న అనుభూతి పొందుతున్నట్లు చెప్పాడు టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ. ఆ అందమైన అనుభూతి మాటల్లో చెప్పలేనిదని అన్నాడు. తామిద్దరి ఆనందానికి అవధులు లేవని చెప్పిన విరాట్​.. త్వరలోనే కుటుంబంలోకి రానున్న మూడో వ్యక్తి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

లాక్​డౌన్​తో చాలాకాలం ఇంటికే పరిమితమవడం వల్ల ప్రాక్టీస్టుకు వెళ్లేటప్పుడు కొంచెం ఇబ్బంది పడినట్లు చెప్పాడు కోహ్లీ. అయినా తనలోని నైపుణ్యం ఏమీ కొరవడలేదని అన్నాడు. స్టేడియంలో అభిమానులు లేకుండా ఆడటం కొత్తగా ఉంటుందని వెల్లడించాడు. చివరిసారిగా 2010 రంజీ ట్రోఫీలో అలా ఆడానని గుర్తు చేసుకున్నాడు.

ప్రస్తుతం ఐపీఎల్​ కోసం దుబాయ్ చేరుకున్న కోహ్లీ.. క్వారంటైన్​ పూర్తి చేసుకుని జట్టులోని సహచర ఆటగాళ్లతో ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. ​సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయో సెక్యూర్​ వాతావరణంలో ఈ మెగా లీగ్​ జరగనుంది.

ఇది చూడండి భారత స్టార్​ రెజ్లర్​కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.