టీమ్ఇండియాతో మూడో టెస్టులో ఆడే విషయం గురించి ఆసీస్ ఓపెనర్ వార్నర్ మాట్లాడాడు. పూర్తి ఫిట్నెస్ సాధించడం సందేహమేనని అన్నాడు. సెలెక్షన్ ప్యానెల్, మేనేజ్మెంట్ పిలుపు మేరకు సిద్ధంగా ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తానని చెప్పాడు.
గాయం కారణంగా టీ20 సిరీస్‌తో పాటు తొలి రెండు టెస్టులకు దూరమైన వార్నర్‌ను ఎలగైనా సిడ్నీ టెస్టులో ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) భావిస్తోంది.
"కొన్నిరోజులుగా ప్రాక్టీస్ చేయలేదు. రెండు రోజులు శిక్షణలో పాల్గొన్న తర్వాత నా పరిస్థితి గురించి మాట్లాడగలను. 100 శాతం సిద్ధంగా ఉన్నానని చెప్పలేను. కానీ సెలెక్టర్లు ఆడాల్సిందే అంటే మాత్రం అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిసాను." -డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్
ప్రాక్టీస్‌లో భారీ షాట్లకు ప్రయత్నించలేదని వార్నర్ చెప్పాడు. మ్యాచ్‌లోనూ సింగిల్స్‌కే ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు. క్యాచ్‌ల కోసం డైవ్ చేయడంలో ఇబ్బంది పడతానని అనిపిస్తే జట్టుకు భారంగా మారదలచుకోలేదని అన్నాడు.
ఆసీస్ బ్యాట్స్‌మన్ జో బర్న్స్, మ్యాథ్యూ వేడ్‌లు తొలి రెండు మ్యాచుల్లో విఫలమవడం వల్ల వార్నర్‌ను బరిలోకి దింపాలనుకుంటుంది ఆస్ట్రేలియా. జనవరి 7 నుంచి సిడ్నీలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: పుజారాను కాదని వైస్ కెప్టెన్సీ రోహిత్‌కే ఎందుకు?