భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మరోసారి ఐపీఎల్లోకి రాబోతున్నాడు. అయితే ఆటగాడిగా కాదు.. కోచ్‌గా కనిపించనున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్‌గా జాఫర్‌ను నియమించినట్లు సమాచారం. వచ్చే సీజన్ నుంచి పంజాబ్ తరఫున ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నాడని తెలుస్తోంది.
పంజాబ్ అధికారిక వెబ్సైట్లో జట్టు సపోర్ట్ స్టాఫ్‌తో పాటు జాఫర్ పేరు ఉండడం ఈ వార్తకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. కింగ్స్ ఎలెవన్ జట్టుకు కుంబ్లే ప్రధాన కోచ్ కాగా.. బౌలింగ్ కోచ్‌గా సునీల్ జోషి, ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఐపీఎల్లో 2008 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో జాఫర్ ఆడాడు. ఆరు మ్యాచ్‌ల్లో 110.57 స్ట్రైక్ రేట్‌తో 130 పరుగులు చేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు జాఫర్. 254 దేశవాళీ మ్యాచ్‌ల్లో దాదాపు 20 వేల పరుగులు చేశాడు.
టీమిండియా తరఫున 2000 నుంచి 2008 వరకు 31 టెస్టులు ఆడాడు. 1944 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున రెండు వన్డేలు ఆడాడు జాఫర్.
ఇదీ చదవండి: సీఏఏపై గంగూలీ కుమార్తె పోస్టు... స్పందించిన దాదా