భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. బంగ్లాదేశ్ అండర్-16 నుంచి అండర్-19 జట్లలోని యువ క్రికెటర్లకు జాఫర్ బ్యాటింగ్ శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఒప్పందం ప్రకారం మే నెల నుంచి ఏప్రిల్ 2020 వరకు బంగ్లాలోని మీర్పూలో ఉన్న క్రికెట్ అకాడమీలో జాఫర్ బ్యాటింగ్ కోచ్గా సేవలందిస్తాడు.
రంజీల్లో 19 సీజన్లు ముంబయికు ప్రాతినిథ్యం వహించిన జాఫర్ తర్వాత విదర్భ తరఫున ఆడాడు. వరుసగా రెండు రంజీ టైటిల్స్ సాధించిన విదర్భ జట్టులో జాఫర్ సభ్యుడు. భారత్ తరఫున 31 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జాఫర్ 1,944 పరుగులు చేశాడు. ఈ మాజీ ఓపెనర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 212 పరుగులు.