ETV Bharat / sports

'ఈడెన్​ కంటే మెల్​బోర్న్​, గబ్బా విజయాలే ప్రత్యేకం'

author img

By

Published : Mar 12, 2021, 9:06 AM IST

కోల్​కతా వేదికగా 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్​ను మరోసారి గుర్తుచేసుకున్నాడు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్​. ఆ మ్యాచ్​ ఇప్పటికీ ప్రత్యేకమేనని వెల్లడించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా నమోదు చేసిన విజయం అంతకన్నా ప్రత్యేకమని కితాబిచ్చాడు ఈ మాజీ బ్యాట్స్​మెన్.

vvs laxman praised team india
'ఈడెన్​ కంటే మెల్​బోర్న్​, గబ్బా విజయాలే ప్రత్యేకం'

కోల్​కతా చరిత్రాత్మక టెస్టు (2001 మార్చి)కు 20 ఏళ్లవుతున్నా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయని మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్​ తెలిపాడు. అప్పటి విజయం ప్రత్యేకమైనది అయినప్పటికీ.. ఇటీవల ఆస్ట్రేలియాలో టీమ్​ఇండియా నమోదు చేసిన విజయాలు అంతకంటే ప్రత్యేకమని వెల్లడించాడు.

"కోల్​కతా టెస్టు ప్రారంభానికి ముందు స్టీవ్​ వా సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు ముంబయిలో మూడ్రోజుల్లోనే మ్యాచ్​ను ముగించి 16 వరుస విజయాల రికార్డును సమం చేసింది. ఈ టెస్టులో తొలి రోజు హర్భజన్ సింగ్ హ్యాట్రిక్​ తీసినా.. మేం ఫాలోఆన్​ ఉచ్చులో చిక్కుకున్నాం. మ్యాచ్​ పూర్తిగా మలుపు తిరగడంలో భజ్జీ, ద్రవిడ్​, నేను కీలకపాత్ర పోషించినా.. విజయానికి కారణాలు సమష్టి కృషి.. జట్టు స్ఫూర్తే."

-వీవీఎస్​ లక్ష్మణ్, మాజీ క్రికెటర్.

"మైదానంలో ద్రవిడ్​, నేనే కాదు జట్టంతా మాతోనే ఉంది. ఈడెన్ గార్డెన్స్​లోని ప్రేక్షకులంతా మద్దతుగా నిలిచారు. ఈడెన్​ నా ఒక్కడికే కాదు టీమ్​ఇండియాకు దశాబ్దాలుగా కలిసొచ్చిన వేదిక. ఎప్పుడు మ్యాచ్​ జరిగినా అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వస్తారు. తమ అభిమాన ఆటగాడు లేదా జట్టు సత్తాచాటాలని కోరుకుంటారు. మూడో రోజు సచిన్​ తెందుల్కర్, సౌరవ్​​ గంగూలీ ఔటవగానే స్టేడియం నుంచి చాలా మంది వెళ్లిపోయారు. కాని నేను, ద్రవిడ్​ మంచి భాగస్వామ్యం నెలకొల్పామని తెలియగానే వెనక్కి పరుగెత్తుకొచ్చారు." అని లక్ష్మణ్ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఆ టెస్టులో ట్రిపుల్​ సెంచరీ చేజారినందుకు చింతిస్తున్నారా? అని చాలామంది అడిగారు.. అస్సలు కాదన్నదే ఎప్పటికీ నా సమాధానమని లక్షణ్​ తెలిపాడు. జట్టు గెలవనప్పుడు వ్యక్తిగత ప్రదర్శనకు పెద్దగా విలువ ఉండదని అభిప్రాయపడ్డాడు. ఆఖరి రోజు ఆటలో వేగంగా పరుగులు రాబట్టి ఇన్నింగ్స్​ను డిక్లేర్​ చేయలన్నది వ్యూహం.. ఆ క్రమంలోనే ఔట్​ అయ్యుండొచ్చని స్పష్టం చేశాడు. ఒకవేళ 300 పరుగులు చేసి.. ఆసీస్​ ఎలాగోలా మ్యాచ్​ను డ్రా చేసుంటే ప్రయోజనం ఉండేది కాదని పేర్కొన్నాడు.

"భారత్​-ఆసీస్ టెస్టు క్రికెట్ సంప్రదాయానికి తగ్గట్లుగా ఇటీవల అద్భుతమైన సిరీస్​ను చూశాం. నా దృష్టిలో మెల్​బోర్న్​, గబ్బాలలో విజయాలు ఈడెన్​ కంటే ఎక్కువ ప్రత్యేకం. బ్రిస్బేన్​లో 30 ఏళ్లకు పైగా ఓటమి ఎరుగని రికార్డుతో ఆసీస్​ నాలుగో టెస్టులో బరిలో దిగింది. టీమ్​ఇండియా మాత్రం విరాట్ కోహ్లీ, ప్రథమ శ్రేణి బౌలర్లు లేకుండా పాల్గొంది. అలాంటి పరిస్థితుల్లో నిర్ణయాత్మక పోరులో నెగ్గడం.. యువ ఆటగాళ్లు తలా ఓ చేయి వేయడం నిజంగా అద్భుతమని" విజయం సాధించిన జట్టును కీర్తించాడు.

ఇదీ చదవండి: ఖతార్​ ఓపెన్: క్వార్టర్​ ఫైనల్లోనే ఫెదరర్ ఓటమి​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.