ETV Bharat / sports

'రోహిత్ అందుకే విజయవంతమైన కెప్టెన్ అయ్యాడు' - లక్ష్మణ్ తాజా వార్తలు

ఒత్తిడిని జయించి రాణించడమే రోహిత్ శర్మను ఐపీఎల్​లో అత్యుత్తమ కెప్టెన్​గా నిలబెట్టిందని అన్నాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. ఒత్తిడి చిత్తు చేస్తున్నా బ్యాటింగ్​లో రాణించేవాడని తెలిపాడు.

రోహిత్
రోహిత్
author img

By

Published : May 29, 2020, 4:57 PM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన సారథి ఎవరంటే ముందుగా చెప్పే పేరు రోహిత్‌ శర్మ. నాలుగుసార్లు ముంబయి ఇండియన్స్‌ను విజేతగా నిలిపాడు. మహేంద్రసింగ్‌ ధోనీ (3 టైటిళ్లు) కన్నా ఒకడుగు ముందే ఉన్నాడు. అయితే ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటమే హిట్‌మ్యాన్‌ విజయాలకు కారణమని వీవీఎస్‌ లక్ష్మణ్ అన్నాడు. దక్కన్‌ ఛార్జర్స్‌ తరఫున తొలి ఐపీఎల్‌ ఆడినప్పటి నుంచే బ్యాట్స్‌మన్‌, నాయకుడిగా అతడు ఎదిగాడని వెల్లడించాడు.

"దక్కన్‌ ఛార్జర్స్‌కు ఆడుతున్నప్పుడే అతడు నాయకుడిగా ఎదిగాడు. తొలిసారి వచ్చినప్పుడు అతడో యువకుడు. టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసి ఒక టీ20 ప్రపంచకప్‌ ఆడాడంతే. 2008 అరంగేట్ర ఐపీఎల్‌లో డీసీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయినా రోహిత్‌ అద్భుతంగా ఆడాడు. ఒత్తిడి చిత్తుచేస్తున్నా మిడిలార్డర్‌లో మెరుగ్గా బ్యాటింగ్‌ చేసేవాడు."

-లక్ష్మణ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు రోహిత్‌. 188 మ్యాచుల్లో 31.60 సగటుతో 4,898 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 109*. జట్టు కోసం అవసరమైతే ఓపెనర్‌, మిడిలార్డర్‌ అని ఆలోచించకుండా ఎక్కడైనా ఆడతాడు.

"ప్రతి మ్యాచ్‌కు, ప్రతి విజయానికి రోహిత్‌ ఆత్మవిశ్వాస స్థాయి పెరిగేది. అనతి కాలంలోనే బృందంలో కీలక సభ్యుడిగా మారాడు. యువకులకు సాయం చేసేవాడు. అభిప్రాయాలు చెప్పేవాడు. నాయకుడిగా ఎదుగుతాడని చెప్పేందుకు ఇవన్నీ ముందస్తు శకునాలు. నా వరకైతే ఒత్తిడిని తట్టుకోవడమే అత్యంత కీలకం. ఒక్కసారి కాదు ఎన్నోసార్లు అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేసి ఎదిగాడు. అందుకే ఐపీఎల్‌ చరిత్రలో హిట్‌మ్యాన్‌ అత్యంత విజయవంతమైన నాయకుడు" అని లక్ష్మణ్‌ స్పష్టం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.