ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ హడావిడి నెలకొంది. ముఖ్యంగా చిన్నపిల్లలు శాంటాక్లాజ్(క్రిస్మస్ తాత) కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఆయనిచ్చే బహుమతులు, ముచ్చట్ల కోసం ఆరాటపడుతుంటారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శాంటాక్లాజ్‌గా మారిపోయాడు. ఓ అనాథాశ్రమానికి క్రిస్మస్ తాత రూపంలో వెళ్లి అక్కడి పిల్లలను ఆశ్చర్యపరిచాడు విరాట్.
-
Watch @imVKohli dress up as 🎅 and bring a little Christmas cheer to the kids who cheer our sportspersons on, all year long!
— Star Sports (@StarSportsIndia) December 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
This joyful season, let’s remember to spread the love. pic.twitter.com/VF8ltmDZPm
">Watch @imVKohli dress up as 🎅 and bring a little Christmas cheer to the kids who cheer our sportspersons on, all year long!
— Star Sports (@StarSportsIndia) December 20, 2019
This joyful season, let’s remember to spread the love. pic.twitter.com/VF8ltmDZPmWatch @imVKohli dress up as 🎅 and bring a little Christmas cheer to the kids who cheer our sportspersons on, all year long!
— Star Sports (@StarSportsIndia) December 20, 2019
This joyful season, let’s remember to spread the love. pic.twitter.com/VF8ltmDZPm
కోల్కాతలోని ఓ అనాథాశ్రామానికి వెళ్లిన కోహ్లీ.. అక్కడ పిల్లలు కోరుకున్న బహుమతులను అందజేసి ఆనందంలో ముంచెత్తాడు. చివర్లో మీరంతా విరాట్ కోహ్లీని కలుసుకుంటారా? అని అడుగగా.. చిన్నారులంతా అవునని బదులిచ్చారు. వెంటనే శాంటాక్లాజ్ రూపంలో ఉన్న కోహ్లీ.. గడ్డం, టోపీ తీసి వారిని ఆశ్చర్యపరిచాడు. అనంతరం చప్పట్లు, కేరింతలతో అతడిని చుట్టుముట్టారు పిల్లలు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది.
కటక్ వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో భారత్ నిర్ణయాత్మక మూడో వన్డే ఆడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి మ్యాచ్ విండీస్ గెలవగా, రెండో మ్యాచ్‌లో కోహ్లీసేన విజయం సాధిచింది. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
ఇదీ చదవండి: మానసిక ఒత్తిడికి లోనవుతున్న 'బిర్లా'.. ఆటకు బ్రేక్