ETV Bharat / state

రాయలకాలం నాటి మాంసాహార 'పొడి కూర' - మీరెప్పుడైనా టేస్ట్​ చేశారా? - KRISHNADEVARAYA FOOD AT TIRUPATI

ఆ ఇంట రాయల కాలం నాటి వంట - రాయల కాలం నాటి మాంసాహారం పచ్చళ్లను పరిచయం చేస్తున్న అన్నాచెళ్లెల్లు

RAYALAVARI COOKING IN TIRUPATI
Sri Krishnadevaraya Food At Tirupati (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2024, 1:34 PM IST

Sri Krishnadevaraya Food At Tirupati : శ్రీకృష్ణ దేవరాయలు అప్పట్లో తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం అతని సైన్యం నెలల తరబడి యుద్ధం చేసేవారు. మరి ఆ సమయంలో సైన్యం ఏం తిన్నారనేది ఎక్కడా కూడా చెప్పి ఉండరు. మనం కూడా చదివి ఉండం కదా! అప్పటి రాయలవారి వంటను తిరుపతికి చెందిన అన్నాచెల్లెలు బండారు దీపక్, బండారు సాయి శ్రావణి మనకు పరిచయం చేస్తున్నారు. ఆ వంటల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం!

ఎక్కువ కాలం నిల్వ ఉండేలా పొడి కూర : శ్రీకృష్ణ దేవరాయల సైన్యం నెలల తరబడి బయట ఉండేందుకు వారి వెంట దుప్పులు, మేకలు, కోళ్లతో తయారు చేసిన ‘పొడి కూర’ అనే వంట పదార్థాన్ని తీసుకెళ్లేవారు. అది ఎక్కువ కాలం నిల్వ ఉండేలా, రుచిగా రాయల వంటశాలలో ప్రత్యేకంగా తయారు చేసేవారు. అలా తిన్న పాలెగాళ్లలో ఒకరు ఆ రుచికి కారణం ఏమిటో తెలుసుకొని, అలా తన ఇంట్లో కూడా ఆ పొడికూర పరిచయం చేశారు. ఇక అంతే.. అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులు అదే రుచికి అలవాటు పడిపోయారు. వాటితో పాటు ఆ కాలం నాటి పచ్చళ్లను కూడా ఇప్పటికీ తయారు చేస్తున్నారు. ఆ కుటుంబానికి చెందిన సంధ్య అనే పెద్దావిడ వాటిని బతికిస్తే, ఇప్పుడు ఆమె కుమారుడు, కుమార్తె కలిసి నేటి తరానికి వీటిని పరిచయం చేస్తున్నారు.

రాయలసీమ పొడి కూర : నాటు కోడి ఛాతి భాగాన్ని కోసి గంటసేపు ఉడికిస్తారు. ఎముకలన్నీ తీసి నూనె లేకుండా వేయిస్తారు. ఇలా పొడి కూరను తయారు చేస్తారు. మేక మాంసంతో కూడా ఇలానే పొడి కూర చేస్తారు. 6 నెలల పాటు నిల్వ ఉండే ఈ పదార్థానికి అమెరికా, మన దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో అభిమానులు చాలా మందే ఉన్నారు. రాయలసీమ అంటే రాగి సంగటి మాత్రమే కాదని, రాయల కాలంలో పొడి కూర ప్రసిద్ధి అని ఈ అన్నాచెల్లెలు తెలియజేస్తున్నారు. రాయల కాలం నాటి మాంసాహారపు పచ్చళ్ల రుచులను అందరికీ పరిచయం చేస్తున్నారు.

ఉద్యోగానికి స్వస్తి పలికి మరీ : సంధ్య కుమారుడు బండారు దీపక్‌ బీటెక్‌ చేసి కొన్నాళ్లు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేశారు. తండ్రి మరణించడంతో తిరుపతికి వచ్చిన దీపక్‌కు వంటల తయారీపై మక్కువతో సాఫ్ట్​వేర్​ ఉద్యోగానికి స్వస్తి పలికారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న పొడికూర వంట గురించి వాళ్ల అమ్మను అడిగి తెలుసుకున్నారు. బీకాం చేసిన చెల్లెలు సాయి శ్రావణితో కలిసి రాయల కాలం నాటి పొడికూరను ఇప్పటి తరానికి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఆ ఇంటి నుంచి రాయల కాలం నాటి వంటల రుచులను అందరికీ అందించడం మొదలుపెట్టారు.

పచ్చళ్లలో పోషకాలెన్నో- పికిల్స్​ తినడం వల్ల కలిగే బెనిఫిట్స్​ ఇవే! - Health Benefits Of Pickles

రాయలసీమ స్టైల్​ వెల్లులి కారం పచ్చడి - సువాసనకే మౌత్ వాటరింగ్ అయిపోతుంది! - Garlic Chutney Recipe

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.