ETV Bharat / state

'పోలీస్​ తొండ'ను మీరెప్పుడైనా చూశారా? - అది ఏం చేస్తుందో మీకు తెలుసా? - POLICE THONDA FOUND KOHEDA GUTTA

హైదరాబాద్​ శివారు కోహెడ గుట్టపై అరుదైన తొండ - రెండు రంగుల కలయికతో మిక్స్​డ్​ రంగులో చూపరులను ఆకట్టుకుంటున్న బల్లి జాతికి చెందిన తొండ - తెలంగాణలో పోలీస్​ తొండగా పిలుస్తారట

Police Thonda in Telangana
Police Thonda in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2024, 1:52 PM IST

Updated : Nov 10, 2024, 2:36 PM IST

Police Thonda in Telangana : బల్లుల గురించి మీకు ఏం తెలుసు చెప్పండి చూద్దాం? అసలు బల్లులు ఎన్ని రకాలో చెప్పగలరా? బల్లికి డైనోసార్​కి పోలిక ఉందంటే నమ్ముతారా? నిత్యం మనం ఇంట్లో ఉండే బల్లులు ఏ రకానికి చెందినవో తెలుసా? బల్లులు గుడ్లు పెడతాయన్న విషయం మనలో ఎంత మందికి తెలుసు. ఊసరవెల్లి గురించి వినే ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టు రంగులను అప్పుటికప్పుడు మార్చుకుంటుంది. కానీ ఇప్పుడు చూసేది రంగు రంగులుగా ఉండే బల్లి జాతే కానీ, ఊసరవెల్లి మాత్రం కాదు. అదేంటని మీకు ఆత్రుతగా ఉంది కదూ. అయితే కింద ఇచ్చిన స్టోరీని చదివేయండి.

బల్లి అంటే కేవలం మన ఇంట్లో గోడకు ఉండే బల్లి మాత్రమే అనుకుంటే పొరపాటు. బల్లికి డైనోసార్​కు సంబంధం ఉంది. కాలం మారుతున్న కొద్దీ రూపాంతరం చెందినవే ఇప్పుడున్న బల్లులు. అడవుల్లో బల్లుల జాతులు ఉంటాయి. అవి పెద్ద శరీరంతో పాకుతూ పాములాగ నాలుక బయటకు తెరుస్తూ భయం గొలిపిస్తూ ఉంటాయి. అలాగే చాలా రకాల బల్లుల జాతులు ఈ విశ్వంపై ఉన్నాయి. అవి వాటికి తగిన భౌగోళిక పరిస్థితుల్లో నివసిస్తూ ఉన్నాయి. రంగురంగుల బల్లులు కూడా ఉన్నాయి. పరిస్థితులను బట్టి రంగులను మార్చే ఊసరవెల్లీ ఉంది.

కానీ ఈ బల్లి మాత్రం రెండు రంగుల కలయికతో మిక్స్​డ్​ రంగులో ఉంటుంది. అదే పోలీసు తొండ. ఇది కూడా బల్లి జాతికి చెందినదే. మరి విశేషం ఏంటంటారా? ఇలాంటి అరుదైన తొండ రకం హైదరాబాద్​ శివారు కోహెడ గుట్టపై కనిపించింది. తెలంగాణలో పోలీస్​ తొండగా పిలువబడే ఈ రకం వివిధ ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తారు. వినడానికే ఈ పేరు వింతగా ఉన్నా, ఇది నిజంగానే పోలీస్​ తొండ.

పోలీస్​ తొండ
కోహెడ గుట్టపై కనిపించిన పోలీస్​ తొండ ఇదే (ETV Bharat)

పోలీస్​ తొండ చరిత్ర : మహబూబ్​నగర్​ జిల్లా ఎంవీఎస్​ అటానమస్ డిగ్రీ కళాశాల జీవశాస్త్ర విభాగం ఆచార్యులు బక్షి రవీందర్​ ఈ పోలీస్​ తొండ గురించి చెప్పారు. ఈ తొండలు తలపై సింధూర వర్ణం, దేహమంతా బూడిద నలుపు రంగుతో ఉంటుంది. ఈ జీవి రాక్​ అగామా (సామ్మోఫిలస్​ డోర్సాలిస్​) అగామిడే కుటుంబానికి చెందిన తొండ జాతి. తెలంగాణలో దాన్ని పోలీస్​ తొండగా పిలిస్తే, రాయలసీమలో నల్లికండ్ల పాము, నలికిరి, నల్లకీచు అనే పేర్లతో పిలుస్తారు.

ఈ పోలీస్​ తొండలు వేసవిలో సంతానోత్పత్తి చేస్తాయి. మగ పోలీస్​ తొండల్లో శరీరం, తల ముందు భాగం స్కార్లెట్​ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. మగతొండ రాళ్లపై ఉన్నప్పుడు తల పూర్తిగా పైకి ఎత్తి మాత్రమే ఉంచుతుంది. దీన్నే ఫుష్​-అప్​ డిస్​ప్లే అంటారు. ఇవి ముందు కాళ్ల మీద నిల్చొని బస్కీలు తీసినట్లు ఊగుతూ ఉంటాయి. రెండు రంగులు వేసినట్లు శరీరాన్ని కలిగి ఉన్న ఇవి చూపరులను ఎంతో ఆకట్టుకుంటాయి. అలాగే శత్రువుల దాడి నుంచి కూడా వేగంగా తప్పించుకోగలవు.

మీ ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా? - ఈ 5 రకాల మొక్కలను పెంచితే చాలు! - అవి దెబ్బకు పరార్!

రైల్లో వెళ్తున్న 'ఆమె'పై డౌట్.. చెక్ చేస్తే బ్యాగులో పాములు, బల్లులు, సాలీళ్లు

Last Updated : Nov 10, 2024, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.