టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి డాట్ బాల్ వేస్తే ఆ బౌలర్‌పై స్లెడ్జింగ్‌కు దిగుతాడని చెప్పాడు బంగ్లాదేశ్ బౌలర్ అల్ అమీన్. సదరు బౌలర్‌పై ఒత్తిడి పెంచేందుకు, అతడ్ని మానసికంగా డిస్టర్బ్ చేసేందుకు ఇలాంటి పనిచేస్తాడనే విషయాన్ని ఓ టీవీ ఛానెల్ లైవ్‌లో వెల్లడించాడు.
"కోహ్లీకి ఎవరైనా డాట్ బాల్ వేస్తే.. ప్రతిసారి ఆ బౌలర్‌పై స్లెడ్జింగ్ చేస్తాడు. అసభ్యకర పదజాలం ఉపయోగిస్తాడు. అతడిపై మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. గొప్ప బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ వంటి వారికి బౌలింగ్ వేశాను. వాళ్లెవరూ ఇలా లేరు. కోహ్లీ మాత్రం స్లెడ్జ్ చేస్తాడు"
-అల్ అమీన్ హుస్సేన్, బంగ్లాదేశ్ బౌలర్
ఇటీవలే మరో ఇంటర్వ్యూలో మాట్లాడిన బంగ్లాదేశ్‌కు చెందిన మరో బౌలర్ రుబెల్ హుస్సేన్.. అండర్-19 స్థాయి నుంచే కోహ్లీ స్లెడ్డింగ్కు దిగేవాడని చెప్పుకొచ్చాడు.