ఈ ఏడాది భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలవాలంటే టీమ్ సారథి విరాట్ కోహ్లీ సెల్ఫిష్‌గా మారాలని అన్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
"విరాట్ కోహ్లీ కాస్త సెల్ఫిష్‌గా తయారైతే చాలు... భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచే ఆస్కారం ఉంటుంది. బరిలోకి దిగాక మొదటి పది బంతులు ఆడేసమయంలో విరాట్ ఆచితూచి వ్యవహరించాలి. ఫామ్‌లో లేనట్లు విరాట్ ఎప్పుడూ కనిపించలేదు. అందుకే అతను డకౌట్ అవడంపై చింతించాల్సిన పనిలేదు. మొదటి 10-15 బంతులు ఆపితే చాలు మైదానంలో విరాట్ అసలు రూపాన్ని మనం చూడొచ్చు."
---మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.
శుక్రవారం ఇంగ్లిష్ జట్టుతో జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన తక్కువ పరుగులకే పరిమితమవ్వడంపై మైకేల్ వాన్ ఈ విధంగా స్పందించాడు. రిస్క్ తీసుకోవడం కోహ్లీకి తగదని తెలిపాడు.
ఇదీ చదవండి:'భారత్ ఓటమికి కారణం అదేనేమో!'