లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ.. సతీమణి, హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి జాలీగా గడుపుతున్నాడు. అయితే వీరిద్దరు కలిసి సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు.
తాజాగా కోహ్లీ ఓ కొత్త ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ టెర్రస్ మీద కూర్చున్నాడు. అయితే కొత్త హెయిర్‌స్టైల్‌తో కనువిందు చేశాడు. బాగా కసరత్తులు చేసి కొద్దిగా సన్నపడినట్లు కూడా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కామెంట్లు కూడా దండిగా పెడుతున్నారు. 'సూపర్', 'కోహ్లీ సన్నపడినట్లు ఉన్నాడే' అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
లాక్డౌన్లో తన భర్త కోహ్లీ, ఆహారాన్ని తూకం వేసి మరీ తింటున్నాడని చెప్పుకొచ్చింది హీరోయిన్ అనుష్క శర్మ. అందుకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది.
ఇది చూడండి : 'గంగూలీ, కోహ్లీలో ఒకటే లక్షణం'