టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ ఏడాది కెప్టెన్గా, బ్యాట్స్మన్గా పలు రికార్డులు తన పేరిట నమోదు చేశాడు. కొత్త ఏడాదిలోనూ అదే ఊపు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది భారత్. ఈ మధ్యన దొరికిన విరామంలో సరదాగా గడుపుతున్నాడు కోహ్లీ. భార్య అనుష్క శర్మతో కలిసి మంచు కొండల్లో విహరిస్తున్నాడు. ఆ ప్రదేశం ఎక్కడో తెలియనప్పటికీ ఆ ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు.
విరుష్క జోడీ.. ఇటీవలే తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని భూటాన్లో జరుపుకున్నారు. అప్పుడూ అభిమానులతో ఫొటోలు పంచుకున్నారు.
స్వదేశంలో జనవరి 5 నుంచి శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది టీమిండియా. అనంతరం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. జనవరి 24న మొదలై మార్చి 4తో కోహ్లీసేన పర్యటన ముగుస్తుంది.
ఇది చదవండి: అమ్మాయిని ఇబ్బందిపెట్టిన కుల్దీప్ యాదవ్!