ETV Bharat / sports

అనుష్క నన్ను పూర్తిగా మార్చేసింది: కోహ్లీ - కోహ్లీ లేటెస్ట్​ న్యూస్​

బాలీవుడ్​ నటి అనుష్క శర్మ తన జీవితంలోకి వచ్చిన తర్వాత తాను పూర్తిగా మారిపోయానని అంటున్నాడు టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. తన ప్రవర్తన, నడవడికలో మార్పు రావడానికి అనుష్క ప్రధాన కారణమని.. ఆమె దగ్గర నుంచి పలు విషయాలను నేర్చుకున్నట్లు తాజాగా ఓ చాట్​ సెషన్​లో వెల్లడించాడు కోహ్లీ.

Virat Kohli Credits Anushka Sharma For Helping Him Change As A Person
అనుష్క నన్ను పూర్తిగా మార్చేసింది: కోహ్లీ
author img

By

Published : Jul 28, 2020, 5:54 PM IST

Updated : Jul 28, 2020, 8:12 PM IST

తన జీవితంలోకి అనుష్క శర్మ వచ్చిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని అంటున్నాడు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. తనను మామూలు వ్యక్తిగా మార్చి విభిన్న దృక్పథాలను ఆస్వాదించగలిగేలా అనుష్క మాయ చేసిందని.. ఆ క్రెడిట్ అంతా తనకే దక్కుతుందని తాజాగా మయాంక్​ అగర్వాల్​తో జరిగిన చాట్​ సెషన్​లో వెల్లడించాడు.

"నాలో ఇన్ని మార్పులకు కారణం నా భార్య అనుష్క. ప్రతి విషయాన్ని విభిన్న కోణాల్లో చూసే విధంగా నన్ను మార్చిన క్రెడిట్​ తనదే. అనుష్క నా జీవిత భాగస్వామి అయినందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నా. ఆటగాడిగా నా బాధ్యత, వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో వంటి విషయాలను అనుష్క నుంచే నేర్చుకున్నా. ఒకవేళ నేను అనుష్కను కలవకపోయి ఉంటే నాలో ఎలాంటి మార్పు లేకుండా గతంలో ఉన్నట్లే ఉండేవాడిని అనుకుంటా. ఆమె నా జీవితంలోకి వచ్చి నన్ను వ్యక్తిగా మార్చింది".

-విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్

గతవారం అనుష్క పుట్టినరోజు సందర్భంగా తానే స్వయంగా కేక్​ను తయారు చేసినట్లు మయాంక్​ అగర్వాల్​తో చెప్పాడు కోహ్లీ. లాక్​డౌన్​లో తన భార్య అనుష్కతో సమయాన్ని గడపడం సహా సోషల్​మీడియాలో ఫిట్​నెస్​ వీడియోలను పంచుకున్నాడు విరాట్​.

Last Updated : Jul 28, 2020, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.