ETV Bharat / sports

స్విమ్మింగ్​ ఫూల్​లో చిల్​ అవుతున్న కోహ్లీ

author img

By

Published : Sep 16, 2020, 9:01 PM IST

యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్​ కోసం ప్రాక్టీసు సెషన్లలో చెమటలు చిందిస్తున్నాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్​​ కోహ్లీ. ఈ క్రమంలోనే అక్కడి వేడి వాతారణంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు.. జట్టు సభ్యులతో కలిసి స్విమ్మింగ్​ ఫూల్​లో సరదాగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు.

Virat Kohli
విరాట్​ కోహ్లీ

క్రికెట్​ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్​ దగ్గరపడింది. సెప్టెంబరు 19న తొలి మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లంతా ప్రాక్టీసు సెషన్​లో స్వేదం చిందిస్తూ శ్రమిస్తున్నారు. అలా శిక్షణ​ ముగిసిన అనంతరం ఒత్తిడి నుంచి ఉపశమనానికి.. బీచ్​, స్విమ్మింగ్​ ఫూల్​లో ఎంజాయ్​ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఆర్సీబీ సారథి​ కోహ్లీ కూడా స్విమ్మింగ్​ ఫూల్​లో ఆనందంగా గడుపుతూ కనిపించాడు. ఆయా ఫొటోలను విరాట్​.. ఇన్​స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అతడితో పాటు జట్టు సభ్యులు పవన్​ నేగి, గుర్​ కీరత్​ ​సింగ్​మన్ కూడా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

ఐపీఎల్​ కెరీర్​లో కోహ్లీ ఇప్పటివరకు 5,412 పరుగులు సాధించాడు. 2016 సీజన్​లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 973 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. నాలుగు సెంచరీలు బాదాడు. అయితే, జట్టును మూడు సార్లు ఫైనల్​కు చేర్చినా.. ట్రోఫీని మాత్రం అందించలేకపోయాడు. ఈసారి ఎలాగైనా టైటిల్​ గెలవాలనే పట్టుదల ఉన్నాడు విరాట్​. ఇందుకోసం జట్టుతో కలిసి తీవ్రంగా కృషి చేస్తున్నాడు​. సెప్టెంబరు 21న.. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో అమీతుమీ తేల్చుకోనుంది ఆర్సీబీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.