పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. స్వదేశంలో సఫారీలపై ఈ బ్యాట్స్‌మెన్ చేసిన తొలి శతకమిదే. అదే విధంగా ఈ క్రికెటర్ ఈ ఏడాది చేసిన మొదటి టెస్టు సెంచరీ కూడా ఇదే. కోహ్లీ టెస్టు కెరీర్లో ఇది 26వది.. సారథిగా 19వది.
నాలుగో బ్యాట్స్‌మెన్...
అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో 26 సెంచరీల రికార్డు సాధించిన వారి జాబితాలో నాలుగో క్రికెటర్ కోహ్లీ. ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను సమం చేశాడీ బ్యాట్స్‌మెన్. విరాట్.. ఈ సెంచరీల రికార్డును 81 టెస్టుల్లో సాధించాడు. ఇదే ఘనతను 67 టెస్టుల్లోనే నమోదు చేశాడు స్మిత్.
-
💯
— BCCI (@BCCI) October 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A fine century by #TeamIndia Skipper @imVkohli. This is his 26th ton in Tests 👏👏 pic.twitter.com/1HTkBDhrOB
">💯
— BCCI (@BCCI) October 11, 2019
A fine century by #TeamIndia Skipper @imVkohli. This is his 26th ton in Tests 👏👏 pic.twitter.com/1HTkBDhrOB💯
— BCCI (@BCCI) October 11, 2019
A fine century by #TeamIndia Skipper @imVkohli. This is his 26th ton in Tests 👏👏 pic.twitter.com/1HTkBDhrOB
26 సెంచరీలు సాధించిన ఆటగాళ్లు (తక్కువ ఇన్నింగ్స్‌ల్లో)
- 69-డాన్ బ్రాడ్‌మన్(ఆస్ట్రేలియా)
- 121-స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)
- 136-సచిన్ తెందూల్కర్(భారత్)
- 138-విరాట్ కోహ్లీ(భారత్)
- 144-సునీల్ గవాస్కర్(భారత్)
- 145-మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా)
స్వదేశంలో దక్షిణాఫ్రికాపై కోహ్లీ.. తొలిసారి 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఈ బ్యాట్స్‌మెన్‌కు ఈ ఏడాదిలో ఇదే తొలి టెస్టు శతకం.
భాగస్వామ్యంలోనూ భేష్...
టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం(178) నమోదు చేసింది కోహ్లీ- రహానే జోడి. ఇప్పటివరకు నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగులు(145) చేసిన రికార్డు ద్రవిడ్-గంగూలీ పేరిట ఉండేది.