టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్. అతడు సాధిస్తోన్న రికార్డులు అద్భుతమని కొనియాడాడు. భవిష్యత్‌లో మరిన్ని ఘనతలు సాధించగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"కోహ్లీ అద్భుతం. అతడు సాధించిన గణాంకాలే చెబుతున్నాయి ఎంత గొప్ప బ్యాట్స్‌మన్ అని. అన్ని ఫార్మాట్లలో అదరగొట్టే అతడు అసాధారణ ఆటగాడు. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా ఉన్న రికార్డులను అతడు బద్దలుకొట్టాడు. విరాట్ మరిన్ని రికార్డులు సాధించడం మనం చూస్తాం. పరుగుల దాహంతో ఉన్న అతడిని ఎవరూ ఆపలేరు. సారథిగా కోహ్లీ ఎన్నో ఘనతలు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో టీమిండియాను నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాడు. నాయకుడిగా జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అతడి ఫిట్‌నెస్ అమోఘం."
ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో గెలుపు కోసం టీమిండియా ఆటగాళ్లు అన్ని అస్త్రాలను ఉపయోగిస్తారని స్మిత్ తెలిపాడు. నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనపైనా స్పందించిన స్మిత్.. తాను ఐదు రోజుల టెస్టు క్రికెట్‌నే ఇష్టపడతానని అన్నాడు.
ఇవీ చూడండి.. సెహ్వాగ్ బట్టతలపై అక్తర్ కామెంట్