పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ను కామెంట్ చేశాడు. ఒకానొక సమయంలో సెహ్వాగ్.. అక్తర్‌ను ఉద్దేశిస్తూ.. "డబ్బుల కోసం షోయబ్ ఇండియాను పొగుడుతాడు" అని అన్నాడు. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్లో వీరూను ట్రోల్ చేశాడు.
"సెహ్వాగ్ చాలా సరదా వ్యక్తి. సీరియస్‌గా మాట్లాడడు. కానీ నేను డబ్బుల కోసం భారత్‌ను పొగుతున్నానని అన్నాడు. సంపద అల్లా మీద ఆధారపడి ఉంటుంది. నాకు సరిపడా సంపద ఉంది. సెహ్వాగ్ తలపై వెంట్రుకల కంటే నా దగ్గర ఎక్కువ డబ్బే ఉంది. నేను సరదాగా అంటున్నాను. దీనిని జోక్‌గా తీసుకోండి."
-షోయబ్ అక్తర్, పాక్ మాజీ పేసర్
2016లో ఓ చాట్ షోలో సెహ్వాగ్.. షోయబ్ అక్తర్‌పై కామెంట్ చేశాడు. "షోయబ్ అక్తర్ మంచి స్నేహితుడు. భారత్‌లో అతడు వ్యాపారం చేయలనుకుంటున్నాడు. అందుకే ఇండియాను పొగుడుతున్నాడు." అని వీరూ సరదాగా వ్యాఖ్యానించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. కోహ్లీ ఈ రికార్డుల్ని అధిగమిస్తాడా..!