ETV Bharat / sports

కోహ్లీ ఒక్క ట్వీట్ ఖరీదు.. అన్ని కోట్ల రూపాయలా? - cricket news

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఒక్క ట్వీట్ చేస్తే చాలు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. ఇంతకీ అతడు ట్విట్టర్​ ద్వారా ఎంత సంపాదిస్తున్నాడు. ఆ జాబితాలో విరాట్ స్థానమెంత? అగ్రస్థానంలో ఎవరున్నారు?

కోహ్లీ ఒక్క ట్వీట్ ఖరీదు.. అన్ని కోట్లా?
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
author img

By

Published : Feb 23, 2020, 5:16 PM IST

Updated : Mar 2, 2020, 7:42 AM IST

క్రీడాభిమానులకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అసమాన బ్యాటింగ్​తో ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను అధిగమించిన విరాట్.. సరికొత్త రికార్డులనూ నెలకొల్పుతున్నాడు. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ తన హవా కొనసాగిస్తున్నాడు.

బ్లేచర్ రిపోర్ట్ సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల్లో ఓ ప్రమోషనల్​ ట్వీట్​కు అత్యధిక మొత్తం తీసుకుంటున్న వారి జాబితాను తయారు చేసింది. ఇందులో ఉన్న క్రికెటర్లలో అందరి కంటే ముందున్నాడు కోహ్లీ.

virat kohli
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

ప్రస్తుతం కోహ్లీకి ట్విట్టర్​లో 5 కోట్ల మంది ఫాలోవర్స్​ ఉన్నారు. ఇతడు ఒక్క ప్రమోషనల్​ ట్వీట్ చేయడం వల్ల 350,101 డాలర్ల మొత్తాన్ని ఆర్జిస్తున్నాడని సదరు సంస్థ పేర్కొంది. మొత్తంగా ఈ జాబితాలో ఇతడు ఐదో స్థానంలో ఉన్నాడు విరాట్. స్టార్ ఫుట్​బాలర్ రొనాల్డో.. 868,604 డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

బ్లేచర్ రిపోర్ట్ సర్వేలోని తొలి ఐదుగురు అథ్లెట్లు

  1. క్రిస్టియానో రొనాల్డో(ఫుట్​బాల్)-868,604 డాలర్లు(సుమారు రూ.6.24 కోట్లు)
  2. ఇనీయెస్టా(ఫుట్​బాల్)- 590,825 డాలర్లు(సుమారు రూ.4.24 కోట్లు)
  3. నెయ్​మర్(ఫుట్​బాల్)-478,138 డాలర్లు(సుమారు రూ.3.43 కోట్లు)
  4. లెబ్రోన్ జేమ్స్(బాస్కెట్​బాల్)-470,356 డాలర్లు(సుమారు రూ.3.38 కోట్లు)
  5. విరాట్ కోహ్లీ(క్రికెట్)-350,101 డాలర్లు (సుమారు రూ.2.5 కోట్లు)

Last Updated : Mar 2, 2020, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.