బాటిల్ క్యాప్ ఛాలెంజ్... ఇటీవల కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. హాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు చాలామంది సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు ప్రయత్నించి విజయం సాధించారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చేరాడు. కొంచెం ఆలస్యమైనా.. వినూత్నరీతిలో ఈ సవాల్‌ను ఛేదించాడు.
-
Better late than never.🏏😎#BottleCapChallenge pic.twitter.com/mjrStZxxTi
— Virat Kohli (@imVkohli) August 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Better late than never.🏏😎#BottleCapChallenge pic.twitter.com/mjrStZxxTi
— Virat Kohli (@imVkohli) August 10, 2019Better late than never.🏏😎#BottleCapChallenge pic.twitter.com/mjrStZxxTi
— Virat Kohli (@imVkohli) August 10, 2019
సాధారణంగా ఈ ఛాలెంజ్‌లో బాటిల్‌ను కాలుతో తన్నుతూ.. కిందపడకుండా బాటిల్ నుంచి మూతను వేరు చేయాలి. కానీ కోహ్లీ కాలుకు బదులు బ్యాట్‌ను ఉపయోగించాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో కామెంటరీ వస్తుండడం వల్ల ఈ వీడియో మరింత ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు కోహ్లీ.
"అసలు చేయకుండా ఉండడం కంటే.. ఆలస్యమైనా చేయడం మంచిది" అని కోహ్లీ పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
ఇవీచూడండి...'ఇదిగో యువీ.. నా బాటిల్ క్యాప్ ఛాలెంజ్'