రంజీల్లో పేసర్ వినయ్ కుమార్ కొత్త చరిత్ర సృష్టించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా ఘనత సాధించాడు. శనివారం మిజోరాంతో మ్యాచ్‌లో మూడో వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం వినయ్ ఖాతాలో 412 వికెట్లు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ స్థానంలో ఉన్న పంకజ్ సింగ్(409 వికెట్లు)ను వెనక్కు నెట్టి టాప్‌లోకి వచ్చాడీ బౌలర్.
-
Thanks my sweetheart ❤️🤗😘🧿 https://t.co/BJs3JiLnqM
— Vinay Kumar R (@Vinay_Kumar_R) December 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thanks my sweetheart ❤️🤗😘🧿 https://t.co/BJs3JiLnqM
— Vinay Kumar R (@Vinay_Kumar_R) December 28, 2019Thanks my sweetheart ❤️🤗😘🧿 https://t.co/BJs3JiLnqM
— Vinay Kumar R (@Vinay_Kumar_R) December 28, 2019
ఇప్పటివరకు రంజీల్లో రాజీందర్ గోయెల్ అత్యధిక వికెట్లు తీశాడు. 637 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. తర్వాతి స్థానంలో వెంకట్రాఘవన్(530) నిలిచాడు. వీరిద్దరి మధ్య అంతరం 107 వికెట్లు ఉండడం విశేషం. ఈ జాబితాలో వినయ్ కుమార్ ఏడో స్థానంలో ఉన్నాడు.
తొలి పది స్థానాల్లో ఉన్న బౌలర్లలో రాజీందర్, వెంకట్రాఘవన్, సునీల్ జోషీ, నరేంద్ర హిర్వాణీ, బీఎస్ చంద్రశేఖర్, వీవీ కుమార్, వినయ్ కుమార్, పంకజ్ సింగ్, సాయిరాజ్ బహుతులే, బిషన్ సింగ్ ఉన్నారు.
34 ఏళ్ల వినయ్ కుమార్.. తన కెరీర్‌ను కర్ణాటక తరఫున 2004లో ప్రారంభించాడు. దాదాపు 15 సంవత్సరాలు అదే జట్టుకు ఆడాడు. మొత్తంగా 133 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 474 వికెట్లు తీశాడు. 2010లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు వినయ్. ఓ టెస్టు, 31 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.
ఇది చదవండి: 2019లో హిట్‌మ్యాన్ 'రోహిత్ శర్మ' బ్యాట్ అద్భుతం చేసింది