టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాఠోడ్ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆయా కోచ్ పదవులకు ఇంటర్వ్యూలు గురువారం పూర్తయ్యాయి. బౌలింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, ఫీల్డింగ్ కోచ్ భరత్ అరుణ్ తిరిగి తమ పదవుల్ని దక్కించుకోనున్నారని సమాచారం. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
50 ఏళ్ల రాఠోడ్.. తన కెరీర్లో ఆరు టెస్టులు, ఏడు వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ ఫార్మాట్లో రికార్డు ఏమంత గొప్పగా లేకపోయినా దేశవాళీ క్రికెట్లో ఆకట్టుకున్నాడు.
బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగర్ దరఖాస్తు చేసుకున్నా అతడు ఇంటర్వ్యూల్లో రెండో స్థానంలో నిలిచాడని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ చెప్పారు. తొలి స్థానంలో విక్రమ్‌రాఠోడ్, మూడో స్థానంలో ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ మార్క్ రామ్‌ప్రకాశ్ నిలిచారని తెలిపారు.
భారత్ జట్టులో నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్‌ను తయారు చేయడంలో బంగర్ విఫలమయ్యాడని, అదే అతడి పదవికి ఎసరు పెట్టిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కపిల్‌దేవ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ గతవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని తిరిగి నియమించారు.
ఇది చదవండి: టీమిండియా కోచ్: రవి భాయ్‌కే మళ్లీ పట్టం