విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో ఉత్తరప్రదేశ్, ముంబయి జట్లు చేరుకున్నాయి. గురువారం జరిగిన టోర్నీ సెమీఫైనల్స్‌లోని తొలి మ్యాచ్‌లో గుజరాత్, ఉత్తరప్రదేశ్ తలపడగా 5 వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్ గెలుపొంది.. తొలి ఫైనలిస్టుగా బెర్త్ ఖరారు చేసుకుంది. రెండో మ్యాచ్‌లో కర్ణాటక, ముంబయి జట్లు తలపడగా.. ఇందులో 72 పరుగుల తేడాతో ముంబయి విజయం సొంతం చేసుకుంది.
దిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో ముంబయి, ఉత్తరప్రదేశ్ ఆడనున్నాయి.
సెమీఫైనల్స్ స్కోర్ వివరాలు:
గుజరాత్ Vs ఉత్తరప్రదేశ్: (5 వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టు గెలుపు)
గుజరాత్ 184; 48.1 ఓవర్లలో (హెట్ పటేల్ 60, పియూష్ చావ్లా 32; యాష్ దయాళ్ 3/34, అకీబ్ ఖాన్ 2/22)
ఉత్తరప్రదేశ్ 188/5; 42.5 ఓవర్లు (అక్షదీప్ నాథ్ 71, కరన్ శర్మ 38, ఉపేంద్ర యాదవ్ 31 నాటౌట్)
ముంబయి Vs కర్ణాటక: (72 పరుగుల తేడాతో ముంబయి విజయం)
ముంబయి 322; 49.2 ఓవర్లు ( పృథ్వీషా 165, షామ్స్ ములానీ 45; వ్యాషక్ వీ 4/56, ప్రసిద్ధ్ కృష్ణ 3/64)
కర్ణాటక 250; 42.4 ఓవర్లు (దేవ్‌దత్ పడిక్కల్ 64, శరత్ 61; తనూష్ కొటియాన్ 2/23, తుషార్ దేశ్‌పాండే 2/37)
ఇదీ చూడండి: టీ20 రికార్డులపై కన్నేసిన కోహ్లీ, రోహిత్