ETV Bharat / sports

రాధ కథ: క్రికెట్​ మైదానంలో వికెట్ల సాగు - రాధా యాదవ్‌ క్రికెటర్​

అతనికున్నది ఓ చిన్న ఇల్లు.. కూరగాయలు అమ్మితే కానీ పూట గడవదు. అలాంటి పరిస్థితుల్లో తన కూతురిని క్రికెటర్‌గా చూడాలనుకున్నాడు ఓ తండ్రి. పదకొండేళ్ల వయసులోనే అబ్బాయిలకు దీటుగా క్రికెట్‌ ఆడుతున్న ఓ అమ్మాయిని చూసి.. తనను అత్యుత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని అనుకున్నాడొక కోచ్‌. ఆ ఆశ, తపన.. ఆ అమ్మాయి కలను నెరవేర్చాయి. ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టుకు విజయాలు అందించే స్థాయికి చేర్చాయి. ఆ క్రికెటర్‌ 19 ఏళ్ల రాధా యాదవ్‌.

Team India Bowler Radha Yadav
రాధ క్రికెట్‌ కథ: క్రికెట్​ మైదానంలో వికెట్ల సాగు
author img

By

Published : Mar 3, 2020, 8:17 AM IST

కూరగాయలు అమ్మే కుటుంబం నుంచి వచ్చిన రాధా.. ప్రస్తుతం మైదానంలో వికెట్ల సాగు చేస్తోంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్​ల్లో అవకాశం పొందని ఈ అమ్మాయి.. మూడో మ్యాచ్​లో వచ్చిన ఛాన్స్​ను ఒడిసి పట్టుకుంది. న్యూజిలాండ్​తో జరిగిన పోరులో బౌలింగ్​లో ఒక వికెట్​ తీయడమే కాకుండా 14 పరుగులు చేసింది. అంతేకాకుండా రెండు అద్భుతమైన క్యాచ్​లతో మ్యాచ్​ స్వరూపాన్ని మార్చేసింది. శ్రీలంకతో జరిగిన ఆఖరి లీగ్​ ​పోరులోనూ.. తన లెఫ్టార్మ్‌ ఆఫ్‌ స్పిన్‌తో నాలుగు వికెట్లు కూల్చి జట్టును విజయపథంలో నడిపించింది. ఈ ప్రదర్శనలతో రాధ ఒక్కసారిగా క్రికెట్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది.

Team India Bowler Radha Yadav
4 వికెట్లు సాధించిన రాధా యాదవ్​

మంచి స్పిన్‌ నైపుణ్యాలతో ఆకట్టుకున్న ఈ అమ్మాయిది ముంబయి. ఆమె చిన్నప్పుడు తండ్రి కూరగాయలు అమ్మితేనే కుటుంబం గడిచేది. ఆమెకు ఇద్దరు సోదరులు. క్రికెట్‌ ఆడాలనే తన ఇష్టానికి పేదరికం అడ్డుపడింది. కానీ కోచ్‌ ప్రఫుల్‌ నాయక్‌ వల్ల ఆమె జీవితం మలుపు తిరిగింది.

అలా మొదలైంది..

2012లో తన మిత్రులతో కలిసి పదకొండేళ్ల రాధ క్రికెట్‌ ఆడుతోంది. అక్కడికి తన మేనకోడలు ఆట చూద్దామని వచ్చిన అప్పటి కోచ్‌ ప్రఫుల్‌ దృష్టి రాధ మీద పడింది. ఎంతసేపటికీ ఔట్​ కాకుండా ఆడుతున్న ఓ అబ్బాయి వికెట్‌ తీసిన ఆమెలో ప్రతిభ ఉందని అతడు గుర్తించాడు. రాధను అత్యుత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం ఆమె తండ్రిని కలిసేందుకు వెళ్లాడు. కానీ పేదరికంలో ఉన్న అతడు.. కూతురు ఆట కోసం డబ్బు పెట్టే పరిస్థితుల్లో లేడు. క్రికెట్లో రాణిస్తే రైల్వేలో ఉద్యోగం సంపాదించే అవకాశముందని ఆమె తండ్రికి చెప్పి... ప్రఫుల్‌ అతడిని ఒప్పించాడు. ఇక అక్కడి నుంచి ఆమె క్రికెట్‌ ప్రయాణం మొదలైంది.

ముందు పేసర్‌..

ఇప్పుడు బంతిని గింగిరాలు తిప్పుతూ.. స్పిన్‌తో అదరగొడుతోన్న రాధ మొదట పేసర్‌. కానీ తనకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ప్రఫుల్‌.. లెఫ్టార్మ్‌ స్పిన్‌ వేయమని సూచించాడు. పేస్‌ నుంచి స్పిన్‌కు మారిన ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె ఎదుగుతున్న క్రమంలోనే భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఆదరణ దక్కడం మొదలైంది. అమ్మాయిలకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతో ముంబయిలో అండర్‌-16 స్థాయిలో అబ్బాయిలతో కలిసి ఆడే అవకాశం కల్పించారు. పృథ్వీ షా, సర్ఫరాజ్‌ ఖాన్‌ లాంటి యువ ఆటగాళ్లతో ఆడిన ఆమె.. తన స్పిన్‌తో ఆకట్టుకుంది.

Team India Bowler Radha Yadav
రాధా యాదవ్‌

ముంబయి నుంచి బరోడాకు..

యువ క్రికెటర్‌గా వేగంగా ఎదుగుతున్న ఆమెకు ఓ సమస్య వచ్చిపడింది. ముంబయిలోని ఓ హోటల్లో పనిచేసే తన కోచ్‌ రిటైర్మెంట్‌ తీసుకుని బరోడాలో నివసించేందుకు సిద్ధమయ్యాడు. ఆ పరిస్థితుల్లో రాధ కూడా కోచ్‌ వెంటే వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. బరోడా వెళ్లిన ఆమె అదరగొట్టే ప్రదర్శనలతో అక్కడి క్రికెట్‌ పెద్దలను ఆకట్టుకుంది.

బరోడా అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె.. ఆ తర్వాత సీనియర్‌ జట్టులో కూడా రాణించి 18ఏళ్ల వయసులోనే టీమిండియా గడప తొక్కింది. తన కచ్చితమైన బౌలింగ్‌ శైలి, బ్యాటర్లను ఊరించేలా బంతులు వేయడం, కీలకమైన సమయాల్లో జట్టుకు అవసరమైన వికెట్లు అందించడం వల్ల టీమిండియాలో కీలక క్రికెటర్‌గా ఎదిగింది. ప్రపంచకప్‌లో ఆడే అవకాశం కొట్టేసింది. తనకు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టు దక్కగానే తన తండ్రి కూరగాయలు అమ్మడం మానేసి.. ఇప్పుడు 'రాధ జనరల్‌ స్టోర్‌'ను నడుపుతున్నాడు.

  • ' class='align-text-top noRightClick twitterSection' data=''>

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.