ETV Bharat / sports

'ఆసీస్​ సిరీస్​లో టీమ్​ఇండియా ఓడిపోతుంది' - ఆసీస్​ భారత్​ సిరీస్​పై మైకల్​ వాన్​

శుక్రవారం ఆసీస్​తో జరిగిన తొలి వన్డేలో టీమ్​ఇండియా ప్రదర్శన తనకు నచ్చలేదని అన్నాడు ఇంగ్లాండ్​ జట్టు మాజీ సారథి మైకేల్​ వాన్. ఈ సిరీస్​లోని అన్ని ఫార్మాట్లలో భారత జట్టు ఓటమి పాలవుతుందని అన్నాడు.

Vaughan
మైకల్​ వాన్
author img

By

Published : Nov 28, 2020, 5:40 AM IST

ఆసీస్​తో జరిగే సిరీస్​లో అన్ని ఫార్మాట్లలోనూ టీమ్​ఇండియా ఓడిపోతుందని జోస్యం చెప్పాడు ఇంగ్లాండ్​ మాజీ సారథి మైకేల్​ వాన్​. భారత జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్​ బౌలర్లు ఉండటాన్ని పాత పద్ధతిగా అభివర్ణించిన అతడు.. ఆ విధానం తనకు నచ్చలేదని అన్నాడు.

"భారత వన్డే జట్టు ఇంకా పాత పద్ధతిని అవలంబిస్తోంది. కేవలం ఐదుగురు బౌలర్లే ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో సత్తా లేదు. ​శుక్రవారం జరిగిన తొలి వన్డేలో స్లోఓవర్​ రేట్​ వేసింది. తమ ఓవర్లను పూర్తిచేయడానికి దాదాపు నాలుగు గంటలకు పైగా సమయం తీసుకుంది. డిఫెన్సివ్, ఫీల్డింగ్​​ సరిగ్గా చేయలేదు. బౌలింగ్​ కూడా పేలవంగా చేసింది. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు. కాగా, ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడుతోంది. కాబట్టి టీమ్ఇండియా ఓడిపోతుందని భావిస్తున్నాను.''

-మైకేల్​ వాన్​, ఇంగ్లాండ్​​ మాజీ సారథి.

శుక్రవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై 67 పరుగుల తేడాతో టీమ్​ఇండియా ఓడిపోయింది. విజయంలో ఫించ్(114), స్మిత్(105) సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. దీంతో వన్డే సిరీస్​లో ఆసీస్​ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఇదీ చూడండి: తొలి వన్డే: ఆసీస్​ ఘనతలు.. భారత్​ చెత్త రికార్డులివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.