దాదాపు ఏడాది తర్వాత మహిళల క్రికెట్ జట్టు మైదానంలో దిగబోతోంది. సౌతాఫ్రికాతో మార్చి 7 నుంచి స్వదేశంలో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్(వన్డే, టీ-20)లో ఆడనుంది. ఈ విషయమై బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఉత్తర్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ) ధ్రువీకరించింది.
ఫిబ్రవరి 25 నాటికి ఇరు జట్లు లఖ్నవూ చేరుకుంటాయని యూపీసీఏ పేర్కొంది. సౌతాఫ్రికాతో 5 వన్డేలతో పాటు 3 టీ20లు ఆడనుంది భారత్. తొలి వన్డేకు ముందు ఆరు రోజుల పాటు ప్లేయర్లు క్వారంటైన్లో ఉండనున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో యూసుఫ్ పఠాన్ క్రికెట్ అకాడమీ