బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అంపైర్ గ్రెగ్ డేవిడ్సన్ అప్పీల్‌కు స్పందించిన తీరు స్టేడియంలో నవ్వులు పూయించింది. మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ రషీద్ ఖాన్ అప్పీల్ చేయగా.. అంపైర్ గ్రెగ్ ఔటిచ్చినట్లు సంకేతమివ్వబోయి ముక్కును తుడుచుకుంటున్నట్లు ప్రవర్తించిన తీరుకు నవ్వులు పూశాయి.
ఈ మ్యాచ్ 17 ఓవర్లో రషీద్ ఖాన్ బంతి వేయగా.. మెల్బోర్న్ బ్యాట్స్‌మన్ బెవూ వెబస్టర్ ప్యాడ్‌కు తగిలింది. రషీద్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశాడు. అయితే మొదట ఔటనుకొని అంపైర్ గ్రెగ్ వేలు పైకెత్తుతూ.. ఔటివ్వబోయాడు. అయితే మళ్లీ తన మనసు మార్చుకొని ముక్కును తుడుచుకుంటున్నట్లు కవర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
-
👃 Greg Davidson with a bit of an itchy schnoz at Marvel Stadium #nosegate #BBL09 pic.twitter.com/m3M772Atox
— KFC Big Bash League (@BBL) December 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">👃 Greg Davidson with a bit of an itchy schnoz at Marvel Stadium #nosegate #BBL09 pic.twitter.com/m3M772Atox
— KFC Big Bash League (@BBL) December 29, 2019👃 Greg Davidson with a bit of an itchy schnoz at Marvel Stadium #nosegate #BBL09 pic.twitter.com/m3M772Atox
— KFC Big Bash League (@BBL) December 29, 2019
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అడిలైడ్ స్ట్రైకర్స్ క్రికెటర్ రషీద్‌ఖాన్. బ్యాట్స్‌మన్‌గా 25 పరుగులతో( 16 బంతుల్లో; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రషీద్‌తో పాటు ఫిలిఫ్ సాల్ట్ (54), అలెక్స్ కేరీ (41) చక్కటి ప్రదర్శనతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు.
అనంతరం లక్ష్య ఛేదనలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేయగలిగింది మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టు. ఆరోన్ ఫించ్ (50), వెబ్‌స్టర్ (37) మాత్రమే రాణించారు. బౌలింగ్‌లో రషీద్, వెస్ అగర్, క్యామరాన్ చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఫలితంగా అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇదీ చదవండి: ఆసీస్ క్రికెటర్ పీటర్ సిడిల్ రిటైర్మెంట్