నెలరోజుల క్రితం లండన్లో జరిగిన కౌంటీ మ్యాచ్లో బంతి తగిలి ఆసుపత్రిలో చేరాడు అంపైర్ జాన్ విలియమ్స్. నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం మరణించాడు. జులై 13న పెమ్బ్రోక్ - నార్బెత్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది.
అంపైర్ మరణించిన విషయాన్ని పెమ్బ్రోక్షైర్ క్రికెట్ క్లబ్ ట్విట్టర్లో తెలిపింది.
-
Sad news this morning regarding umpire John Williams.
— Pembrokeshire Cricket 🏏 (@PembsCricket) August 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
John passed away this morning with his family at his bedside. Thoughts of all of Pembrokeshire Cricket are with Hilary and the boys at this difficult and sad time
">Sad news this morning regarding umpire John Williams.
— Pembrokeshire Cricket 🏏 (@PembsCricket) August 15, 2019
John passed away this morning with his family at his bedside. Thoughts of all of Pembrokeshire Cricket are with Hilary and the boys at this difficult and sad timeSad news this morning regarding umpire John Williams.
— Pembrokeshire Cricket 🏏 (@PembsCricket) August 15, 2019
John passed away this morning with his family at his bedside. Thoughts of all of Pembrokeshire Cricket are with Hilary and the boys at this difficult and sad time
"అంపైర్ జాన్ విలియమ్స్ గురించి చేదు వార్త వినాల్సి వచ్చింది. జాన్ ఈ రోజు ఉదయాన్నే మరణించారు. పెమ్బ్రోక్షైర్ క్రికెట్ క్లబ్ తరపున సంతాపం తెలుపుతున్నాం." -పెమ్బ్రోక్షైర్ క్రికెట్ క్లబ్
ఆ మ్యాచ్లో అంపైర్ జాన్ తలకు బంతి తగిలి తీవ్ర గాయమైంది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం హావర్ఫోర్డ్వెస్ట్లోని మరో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇది చదవండి: రాబిన్తో టీమిండియా కోచ్ ఇంటర్వ్యూలు షురూ