కెనడా గ్లోబల్ టీ20 టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం తెరలేచింది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మన్సూర్ అక్తర్ ఫిక్సింగ్ కోసం తనను సంప్రదించినట్లు ఆరోపించాడు ఉమర్ అక్మల్. ఈ విషయంపై పీసీబీ అవినీతి నిరోధక విభాగాన్ని ఆశ్రయించాడు. ఫలితంగా ఘటనపై పాక్ క్రికెట్ బోర్డు, గ్లోబల్ టీ20 విభాగం దర్యాప్తు చేపట్టనున్నాయి.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్సూర్.. ఫిర్యాదు సమయానికి అమెరికాలో ఉన్నాడు. 1980-90 మధ్య పాక్ తరపున 19 టెస్ట్‌లు, 41 వన్డేలు ఆడాడీ 61 ఏళ్ల మాజీ ఆటగాడు.
ఇదేం కొత్తకాదు...
ఏదో ఒక విషయంపై ఈ మధ్య వివాదాల్లో నిలుస్తూనే ఉన్నాడు ఉమర్. ఈ ఆటగాడికి 2019 ఐసీసీ ప్రపంచకప్‌లో ఆడే అవకాశం కల్పించింది పీసీబీ. అయితే ఈ సిరీస్ నుంచి అనూహ్యంగా వైదొలిగాడు. 2015 ఐసీసీ ప్రపంచకప్‌లోనూ, హాంకాంగ్ లీగ్‌లోనూ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించాడు.
గ్లోబల్ టీ20లో...
ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టీ20 లీగ్‌లో 6 జట్టులు తలపడుతున్నాయి. ఇందులో 'విన్నీ పెగ్ హాక్స్' తరపున ఆడుతున్నాడు అక్మల్. ఈ సిరీస్‌లో ఉమర్ మూడు మ్యాచ్‌ల్లో 70 పరుగులు చేశాడు.
ఇదీ చూడండి: 'సోదరా.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది'