ETV Bharat / sports

'టీమిండియాను వారి గడ్డపై ఓడించడమే మా లక్ష్యం'

టెస్టుల్లో నంబర్.1 ర్యాంక్​ను ఆసీస్ సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు కోచ్ జస్టిన్ లాంగర్. భారత్​ను వారి గడ్డపైనే ఓడించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

'టీమిండియాను వారి గడ్డపై ఓడించడమే మా లక్ష్యం'
ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్
author img

By

Published : May 2, 2020, 12:31 PM IST

Updated : May 3, 2020, 9:01 AM IST

టెస్టుల్లో టీమిండియాను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. ఈ సందర్భంగా మాట్లాడిన ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్.. భారత్​ను వారి దేశంలో ఓడించడమే తమ లక్ష్యమని అన్నారు. అయితే ఇది అంత సులభమైన విషయం కాదని అభిప్రాయపడ్డారు.

దీనితో పాటే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ గెలవడం, అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకున్నామని లాంగర్ అన్నారు. షెడ్యూల్​ ప్రకారం ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో భారత నాలుగు టెస్టులు ఆడనుంది. అంతకు ముందు 2018-19 మధ్య జరిగిన ఆసీస్ టెస్టు పర్యటనలో రికార్డు సృష్టించింది కోహ్లీసేన. 2-1తో సిరీస్​ గెల్చుకుని, 71 ఏళ్ల తర్వాత అక్కడ టెస్టు సిరీస్​​ గెల్చుకున్న తొలి ఆసియా జట్టుగా నిలిచింది.

నిన్న(శుక్రవారం) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో ఆసీస్ 116 పాయింట్లతో ఉండగా, న్యూజిలాండ్(115), భారత్(114) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2016 నుంచి అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న టీమిండియా.. ఐసీసీ వార్షిక లెక్కల ప్రకారం, మే 2019 నుంచి పరిగణించిన ఫలితాల వల్ల మూడో స్థానానికి పడిపోయింది.

Last Updated : May 3, 2020, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.