ఆదివారం జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ గెలిచి, తొలిసారి కప్పును ముద్దాడింది. ఆ సమయంలో కొందరు బంగ్లా ఆటగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారత్ ఆటగాళ్లపై వెకిలి చేష్టలు చేస్తూ కవ్వించారు. ఈ కారణంగా ఇరుజట్లు క్రికెటర్లు మైదానంలోనే గొడవకు దిగారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. మొత్తంగా ఐదుగురిపై చర్యలు తీసుకుంది. అందులో ముగ్గురు బంగ్లా ఆటగాళ్లు(తోహిద్ హ్రిదోయ్, షమీమ్ హుస్సేన్, రకిబుల్ హసన్ )కాగా, ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు(ఆకాశ్ సింగ్, రవి బిష్ణోయ్).
ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆర్టికల్ 2.21ను నలుగురు ఉల్లంఘించగా, భారత్ బౌలర్ రవి బిష్ణోయ్ 2.5 నిబంధనను మీరినట్లు తేలింది.
అంతకు ముందు, ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ.. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని అన్నాడు. భారత జట్టు సారథి ప్రియమ్ గార్గ్ మాత్రం.. ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇదే కాకుండా మ్యాచ్ జరుగుతున్న సమయంలో బంగ్లా బౌలర్ షోరిఫుల్ ఇస్లామ్ అయితే ప్రతి బంతి వేసిన తర్వాత భారత బ్యాట్స్‌మెన్‌పై స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు.
ఈ చర్యల కారణంగా సదరు ఆటగాళ్ల ఖాతాలో 4 నుంచి 12 సస్పెన్సన్ పాయింట్లు చేరుతాయి. ఇవి వారు ఆడబోయే తర్వాత మ్యాచ్‌లపై పడనుంది.
-
Shameful end to a wonderful game of cricket. #U19CWCFinal pic.twitter.com/b9fQcmpqbJ
— Sameer Allana (@HitmanCricket) February 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shameful end to a wonderful game of cricket. #U19CWCFinal pic.twitter.com/b9fQcmpqbJ
— Sameer Allana (@HitmanCricket) February 9, 2020Shameful end to a wonderful game of cricket. #U19CWCFinal pic.twitter.com/b9fQcmpqbJ
— Sameer Allana (@HitmanCricket) February 9, 2020