మాంచెస్టర్ వేదికగా శనివారం జరిగిన న్యూజిలాండ్-వెస్టిండీస్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో కివీస్ గెలిచినా.. సెంచరీ చేసిన కరీబియన్ బ్యాట్స్‌మన్ బ్రాత్‌వైట్ క్రికెట్ ప్రేమికుల మనసుల్ని గెలుచుకున్నాడు.
164 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వెస్టిండీస్‌ను ఒకానొక దశలో గెలిచేలా చేశాడు బ్రాత్‌వైట్. 7 బంతుల్లో 6 పరుగులు అవసరమైన దశలో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. అతడ్ని ప్రశంసిస్తూ పలువురు ట్వీట్స్ చేశారు.
ఇది చదవండి: WC19: హమ్మయ్య.. గెలుపు కివీస్‌దే..!