యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వరణుడు విజృంభిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ ఆలస్యం కానుంది. మధ్యలో ఓ సారి ఆగిన వాన మళ్లీ ప్రారంభమైంది. పిచ్‌పై కవర్లు కప్పి ఉంచింది సిబ్బంది.
ఇందులో విజయం సాధించి తొలి టెస్టు పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది ఇంగ్లీష్ జట్టు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది కంగారూ జట్టు. గాయాలతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు జేమ్స్ అండర్సన్, మొయిన్ అలీ దూరమయ్యారు.
ఇది చదవండి: కరీబియన్ దీవుల్లో భారత క్రికెటర్ల జలకాలాట