ETV Bharat / sports

మొతేరా​ పిచ్​పై సూపర్ ఇన్నింగ్స్​లు ఇవే!

author img

By

Published : Feb 22, 2021, 5:30 PM IST

అహ్మదాబాద్ మొతేరా వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు బుధవారం (ఫిబ్రవరి 24) ప్రారంభంకానుంది. ఈ స్టేడియంలో టీమ్ఇండియాకు మంచి రికార్డుంది. ఈ నేపథ్యంలో ఈ మైదానంలో భారత ఆటగాళ్లు ఆడిన టాప్-5 ఇన్నింగ్స్​లను ఒకసారి గుర్తు చేసుకుందాం.

Top 5 Test knocks by Team India batsmen in Ahmedabad
మొతేరా​ పిచ్​పై సూపర్ ఇన్నింగ్స్​లు!

భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి 24) ప్రారంభంకానుంది. మొతేరా వేదికగా ఈ డేనైట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. పింక్ బాల్​తో టీమ్ఇండియా ఆడబోతున్న మూడో టెస్టు ఇది. అయితే మొతేరాను ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా పునఃనిర్మించిన తర్వాత జరుగుతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మొతేరా స్టేడియంలో భారత్ ఎన్ని టెస్టులు ఆడింది? ఎవరు ఆ మైదానంలో సూపర్ ఇన్నింగ్స్​లతో మెప్పించారు? వంటి విషయాలు ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.

రికార్డు భళా

అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో ఇప్పటివరకు 12 టెస్టు మ్యాచ్​లు జరిగాయి. ఇందులో నాలుగింటిలో గెలిచిన భారత్ రెండు ఓడిపోయింది. ఇంగ్లాండ్​తో ఆడిన రెండు మ్యాచ్​ల్లో ఒకటి గెలిచి మరొకటి డ్రా చేసుకుంది.

మొతేరాలో అద్భుత ఇన్నింగ్స్​లు

వీరేంద్ర సెహ్వాగ్ ( ఇంగ్లాండ్​పై 117 పరుగులు-2012)

టెస్టుల్లో పరుగులు రాబట్టే తీరునే మార్చేశాడు టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఇంగ్లాండ్​పై 2012లో మొతేరా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్​లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు వీరు. తర్వాత ఇతడు మరి కొన్ని టెస్టులు ఆడినా.. తన కెరీర్​లో ఇదే చివరి టెస్టు సెంచరీ కావడం గమనార్హం.

ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. గౌతమ్ గంభీర్​ 45 పరుగులు చేశాడు. ఇతడి సాయంతో వీరేంద్ర సెహ్వాగ్ మొదటి వికెట్​కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గంభీర్ ఔటైనా.. తన విధ్వంసకర ఇన్నింగ్స్​తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు వీరు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, గ్రేమ్ స్వాన్ లాంటి ఇంగ్లాండ్ మేటి బౌలర్లను ఎదుర్కొని 15 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం బాదాడు. తర్వాత స్వాన్ బౌలింగ్​లో స్వీప్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డయ్యాడు.

Sehwag
సెహ్వాగ్

ఇక ఆ తర్వాత ఛెతేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ సాయంతో టీమ్ఇండియా 8 వికెట్ల నష్టానికి 521 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా 5 వికెట్లతో మెరవడం వల్ల ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో 191 పరుగులకే ఆలౌటైంది. తర్వాత ఫాలో ఆన్​ ఆడిన ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ అద్భుత (176) శతకం సాయంతో రెండో ఇన్నింగ్స్​లో 406 పరుగులు సాధించింది. అయినా ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది.

మహ్మద్ అజారుద్దీన్ (శ్రీలంకపై 154 పరుగులు-1994)

90వ దశకంలో టీమ్ఇండియా క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అద్భుత ఇన్నింగ్స్​లు ఆడాడు. ముఖ్యంగా స్వదేశీ పిచ్​లపై మరపురాని ఇన్నింగ్స్​లతో చెలరేగాడు. 1994లో శ్రీలంకతో మొతేరాలో జరిగిన మ్యాచ్​లో చేసిన సెంచరీ కూడా అందులో ఒకటి.

Azharuddin
అజారుద్దీన్

ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్​లో 119 పరుగులకు ఆలౌటైంది. వెంకటపతి రాజు 5, రాజేశ్ చౌహాన్ 3 వికెట్లతో మెరిశారు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా అజారుద్దీన్ కెప్టెన్ ఇన్నింగ్స్​తో 358 పరుగులు చేసింది. 152 పరుగుల ఈ ఇన్నింగ్స్​లో ఇతడు 16 ఫోర్లు, ఒక సిక్స్ సాధించాడు. 361 నిమిషాల పాటు క్రీజులో నిలిచిన అజారుద్దీన్ చివరికి ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్​లో బౌల్డయ్యాడు. తర్వాత లంక రెండో ఇన్నింగ్స్​లో 222 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ 17 పరుగుల తేడాతో మ్యాచ్​ గెలిచింది టీమ్ఇండియా.

సచిన్ తెందూల్కర్ (న్యూజిలాండ్​పై 217 పరుగులు-1999)

క్రికెట్ అరంగేట్రం తర్వాత దాదాపు 10 ఏళ్లకు తన తొలి డబుల్ సెంచరీ సాధించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్. 1999లో మొతేరా మైదానంలో న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో ఈ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా ఓపెనర్ దేవాంగ్ గాంధీ వికెట్​ను ప్రారంభంలోనే కోల్పోయింది. తర్వాత రాహుల్ ద్రవిడ్ 33 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు.

తర్వాత మాస్టర్ సచిన్​ తన క్లాస్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. దాదాపు 500 నిమిషాలు క్రీజులో నిలిచిన తెందూల్కర్ 29 ఫోర్లు రాబట్టాడు. ముఖ్యంగా కివీస్ స్టార్ బౌలర్లు క్రిస్ కేన్, డేనియల్ వెటోరీని ఎదుర్కొని డబుల్ సెంచరీ (217) సాధించాడు. నాలుగో వికెట్​కు సౌరభ్ గంగూలీతో కలిసి 281 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాదా 125 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 7 వికెట్ల నష్టానికి 583 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది.

Sachin
సచిన్

నాథన్ అస్లే, క్రిస్ కేన్ అర్ధసెంచరీలతో కివీస్​ తొలి ఇన్నింగ్స్​లో 308 పరుగులు చేసింది. తర్వాత 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన టీమ్​ఇండియా రెండో ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. దీంతో 424 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ మ్యాచ్​ను డ్రా చేసుకుంది. గారీ స్టీడ్, క్రేగ్ స్పియర్​మన్, స్టీఫెన్ ఫ్లెమింగ్ అర్ధసెంచరీలతో అలరించారు.

రాహుల్ ద్రవిడ్ (న్యూజిలాండ్​పై 222 పరుగులు-2003)

2003లో న్యూజిలాండ్​తో మొతేరాలో జరిగిన టెస్టు మ్యాచ్​లో మిస్టర్ డిఫెండబుల్​ తన క్లాస్ ఇన్నింగ్స్​తో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియాకు ఆకాశ్ చోప్రా (42), సెహ్వాగ్ (29) మంచి ప్రారంభన్నిచ్చినా.. భారీ భాగస్వామ్యం నెలకొల్పలేకపోయారు. సచిన్ కూడా 8 పరుగులకే ఔట్ అవడం వల్ల భారత జట్టు 134 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

తర్వాత క్రీజులోకి వచ్చిన ద్రవిడ్.. టీమ్ఇండియాను గట్టెక్కించాడు. దాదాపు 578 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన ద్రవిడ్.. 387 బంతులాడి 28 ఫోర్లు, ఒక సిక్స్ బాది 222 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో లక్ష్మణ్​ (64)తో 130, గంగూలీ (100*)తో 182 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ద్రవిడ్. తర్వాత జాకబ్ ఓరమ్ బౌలింగ్​లో కీపర్​కు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు.

Dravid
ద్రవిడ్

ద్రవిడ్ డబుల్ సెంచరీ సాయంతో టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 500 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. తర్వాత ఆస్లే సా సెంచరీతో 340 పరుగులు చేసింది కివీస్. అనంతరం రెండో ఇన్నింగ్స్​లో ద్రవిడ్ 74 పరుగుల సాయంతో కివీస్ ముందు 340 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరకు క్రేగ్ మెక్​మిలన్ (83), ఆస్లే (51) అద్భుత పోరాటంతో మ్యాచ్​ను డ్రా చేసుకుంది కివీస్.

పుజారా (ఇంగ్లాండ్​పై 206 పరుగులు-2012)

2012లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో టీమ్ఇండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు నయా వాల్ పుజారా. మొదట బ్యాటింగ్​ చేసిన భారత్​కు సెహ్వాగ్ సెంచరీతో జోరు చూపించగా, పుజారా తన మారథాన్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. దాదాపు 513 నిమిషాల పాటు క్రీజులో ఉన్న పుజారా.. 21 ఫోర్స్ సాయంతో 389 బంతుల్లో 206 పరుగులు సాధించాడు. ఇతడికి టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోర్.

Pujara
పుజారా

ఐదో వికెట్​కు యువరాజ్ (74)తో కలిసి 130 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు పుజారా. తర్వాత 8 వికెట్ల నష్టానికి 521 పరుగులు చేసిన టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. పుజారా నాటౌట్​గా నిలిచాడు. ఈ డబుల్ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు పుజారా. కానీ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న ఇంగ్లాండ్ సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. స్వదేశంలో టెస్టు సిరీస్​ను కోల్పోవడం టీమ్ఇండియాకు ఇదే చివరిసారి.

ఇవీ చూడండి: భారత్​ Vs ఇంగ్లాండ్​: డేనైట్​ మ్యాచ్​కు పిచ్​ ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.