ETV Bharat / sports

సంపాదనలో పురుష క్రికెటర్లతో భారత మహిళలు పోటీ - జూలన్​ గోస్వామి

ఇటీవల కాలంలో తమ ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకుంటున్న పలువురు భారత మహిళా క్రికెటర్లు.. ఆర్జనలో తమ దూకుడు చూపిస్తున్నారు. బీసీసీఐ కాంట్రాక్ట్​లతో పాటు పలు బ్రాండ్లకు ప్రచారం చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

Top 5 highest earning India Women cricketers
ఈ మహిళా క్రికెటర్లు ఎంత సంపాదిస్తున్నారంటే?
author img

By

Published : Jun 1, 2020, 2:28 PM IST

Updated : Jun 1, 2020, 3:00 PM IST

టీమ్​ఇండియా క్రికెటర్ల అంటే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్.​ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ తదితరులు ఆటలోనే కాకుండా సంపాదనలోనూ యమస్పీడ్​ చూపిస్తున్నారు. వారికి మేం తక్కువ కాదంటూ భారత మహిళా క్రికెటర్లు తమ బ్రాండ్ వాల్యూ​ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలోని ఓ ఐదుగురు విశేషాలే ఈ కథనం.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్​లో భారత క్రికెటర్లు అదరగొట్టారు. అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్​కు చేరినా, తుదిమెట్టుపై బోల్తా పడ్డారు. అయినప్పటికీ తమ ఆటతో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో షెఫాలీ వర్మ, జులాన్​ గోస్వామి, పూనమ్​ యాదవ్​, స్మృతి మందణ్న తదితరులు ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువగా ఆర్జించే ఐదుగురు భారత మహిళా క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.​

1) మిథాలీ రాజ్​

మహిళల క్రికెట్​లో స్టార్​ బ్యాట్స్​మన్ మిథాలీ రాజ్​. ఆర్జనలోనూ టాప్​లోనే ఉంది. బీసీసీఐ కాంట్రాక్ట్​ ప్రకారం గ్రేడ్​ 'బీ'లో ఉన్న ఈమెకు, ఏడాదికి రూ.30 లక్షలు దక్కుతుంది. దీనితోపాటే ప్రజాదరణ కలిగిన పెద్ద బ్రాండ్​లు అలెన్​ సోలీ, అమెరికన్​ టూరిస్టర్​, నెక్స్ట్​ జెన్,​ ఫిట్​నెస్​ స్టూడియో, రాయల్​ ఛాలెంజ్​లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.

Top 5 highest earning India Women cricketers
మిథాలీ రాజ్​

ప్రస్తుతం భారత మహిళా వన్డే, టెస్టు జట్లకు నాయకత్వం వహిస్తోంది. వన్డేల్లో 189 మ్యాచ్​ల్లో టీమ్​ఇండియా​కు ఆడి, 50.64 సగటు​తో 7000కు పైగా పరుగులు చేసింది. 10 టెస్టు​ల్లో 16 ఇన్నింగ్స్​లు ఆడి, 51 సగటు​తో 663 పరుగులు చేసింది.

2) హార్మన్​ప్రీత్​ కౌర్

ఇటీవలే జరిగిన టీ20 ప్రపంచకప్​లో భారత్ ఫైనల్​కు చేరడంలో కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్​ కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం మన జట్టుకు సారథిగా వ్యవహరిస్తూనే, టీ20 లీగుల్లో సిడ్నీ థండర్స్​ ఉమెన్​, సూపర్​ నోవా జట్లకు కెప్టెన్​గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ​

హర్మన్​ప్రీత్​ కౌర్​

హర్మన్​ప్రీత్​.. బీసీసీఐ కాంట్రాక్ట్​ల్లో గ్రేడ్​ 'ఏ' కేటగిరీలో ఉంటూ, ఏడాదికి రూ.50 లక్షలు సంపాదిస్తోంది. దీంతోపాటే ఆమె వాడే బ్యాట్​ను సియాట్​ స్పాన్సర్​ చేస్తోంది. ఐటీసీకి సంబంధించిన నేచురల్​-బీ అనే పండ్ల రసాలకు బ్రాండ్​ అంబాసిడర్​గా వ్యవహరిస్తూ సంపాదిస్తోంది.

తన కెరీర్​లో ఇప్పటివరకు 114 టీ20​ల్లో 2000కు పైగా పరుగులు చేయడమే కాకుండా, 29 వికెట్లను పడగొట్టింది.

3) స్మృతి మందణ్న

మహిళల క్రికెట్​లో ఆటతోనే కాకుండా అందంతోనూ అలరిస్తోంది స్మృతి మందణ్న. 2017 మహిళల ప్రపంచకప్​లోని ప్రదర్శనతో వెలుగులోకి వచ్చింది. గ్రేడ్​ 'ఏ' కేటగిరీలో ప్రస్తుతమున్న ఈమె.. ఏడాదికి రూ.50 లక్షలు ఆర్జిస్తోంది. చెల్లిస్తున్నారు. దీంతో పాటు రెండు బ్రాండ్​లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఈమె బ్యాట్​ స్పాన్సర్​గా హీరో మోటోకార్ప్​ వ్యవహరిస్తోంది. రెడ్​ బుల్​ ఎనర్జీ డ్రింక్​కు బ్రాండ్ అంబాసిడర్​గా ఉంది.

స్మృతి మందణ్న

కెరీర్​లో 2 టెస్టులు, 51 వన్డేలు, 75 టీ20లకు భారత్​ తరఫున ఆడిన స్మృతి.. ప్రస్తుతం భారత​ జట్టుకు వైస్​ కెప్టెన్​గా ఉంది. టీ20 లీగ్​ల్లో​ ఉమెన్స్​ ఛాలెంజ్​, మహిళల బిగ్​ బాష్​ లీగ్​లోనూ ఆడుతోంది.

4) పూనమ్​ యాదవ్

ఇటీవలే టీ20 ప్రపంచకప్​లో పాల్గొని, తన బౌలింగ్​తో ప్రత్యర్థుల వెన్నులో భయం పుట్టించింది పూనమ్​ యాదవ్​. టోర్నీ ఆరంభమ్యాచ్​ నుంచే తన స్పిన్ మాయాజాలంతో వికెట్లను పడగొట్టింది. బీసీసీఐ గ్రేడ్​ 'ఏ' కేటగిరీలో ఉన్న ఈమె.. ఈ కాంట్రాక్ట్​ ద్వారా ఏడాదికి రూ.50 లక్షలు అందుకుంటోంది. భవిష్యత్​లో ఆమెను పలు బ్రాండ్​లు ప్రచారకర్తగా నియమించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి పలు సంస్థలు.

పూనమ్​ యాదవ్

5) జులాన్​ గోస్వామి

సీనియర్ పేసర్​ జులాన్​ గోస్వామి.. ఇప్పటికే భారత్ మహిళా క్రికెట్లో ఎన్నో మైలురాళ్లు అందుకుంది. ప్రస్తుతం గ్రేడ్​ 'బీ' కాంట్రాక్ట్​తో, ఏడాదికి రూ.30 లక్షలు, బీసీసీఐ నుంచి అందుకుంటోంది.

జులాన్​ గోస్వామి

తన కెరీర్​లో 10 టెస్టులు, 182 వన్డేలు, 68 టీ20ల్లో ఆడింది జులాన్. వన్డేల్లో 3.28 ఎకానమీ రేట్​తో 225 వికెట్లను సాధించింది​.

ఇదీ చూడండి... ధోనీ భార్యను తెగ ఇబ్బంది పెట్టిన చాహల్!

Last Updated : Jun 1, 2020, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.