సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా విజయాలను కొనసాగిస్తోంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇది పూర్తయ్యాక ఫిబ్రవరి 5 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తాజాగా ఇందుకోసం జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ సెలక్షన్ కమిటీ.
ఈ సిరీస్‌తో కైల్ జేమిసన్ వన్డే అరంగేట్రం చేయనున్నాడు. గాయం కారణంగా టీ20 సిరీస్‌కు దూరమైన వికెట్ కీపర్ టామ్ లాథమ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. పేసర్ స్కాట్ కుగ్గెలిజిన్, హమీష్ బెన్నెట్ రెండేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు.
గాయం కారణంగా పేసర్లు ట్రెంట్ బౌల్ట్, ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. మొత్తం 13 మందితో కూడిన జట్టులో ఆల్‌రౌండర్లు గ్రాండ్‌హోమ్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్ ఉన్నారు. లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి మొదటి వన్డేకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు.
ఐసీసీ ప్రపంచకప్-2019 తర్వాత న్యూజిలాండ్ ఆడుతోన్న మొదటి వన్డే సిరీస్ ఇది. ఈ మెగాటోర్నీలో దురదృష్టవశాత్తు ఫైనల్లో ఓడింది విలియమ్సన్ సేన.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
న్యూజిలాండ్ జట్టు:
కేన్ విలియమ్సన్ (సారథి), హమీష్ బెన్నెట్, టామ్ బ్లండెల్, గ్రాండ్‌హోమ్, మార్టిన్ గప్తిల్, కైల్ జేమిసన్, స్కాట్ కుగ్గెలిజిన్, టామ్ లాథమ్ (కీపర్), జిమ్మీ నీషమ్, హెన్రీ నికోలస్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి (మొదటి వన్డే), టిమ్ సౌథీ, రాస్ టేలర్
ఇవీ చూడండి.. మ్యాచ్ మలుపు తిరిగింది అక్కడే: కోహ్లీ