ETV Bharat / sports

హజారే ట్రోఫీకి నటరాజన్​ దూరం - TNCA releases Natarajan from Vijay Hazare Trophy

విజయ్​ హజారే ట్రోఫీలో భాగంగా తమ జట్టులో యువ పేసర్​ నటరాజన్​కు అవకాశమిచ్చిన తమిళనాడు.. తాజాగా అతడిని విడుదల చేసింది. ఇంగ్లాండ్​తో జరగబోయే వన్డే సిరీస్​లో నట్టూ పూర్తిస్థాయి ఫిట్​నెస్​తో ఆడాలని బీసీసీఐ భావిస్తుండటమే ఇందుకు కారణమని తెలిపింది.

nattu
నట్టూ
author img

By

Published : Feb 11, 2021, 1:42 PM IST

రాబోయే విజయ్​ హజారే ట్రోఫీలో భాగంగా తమ జట్టులో యార్కర్ల స్పెషలిస్ట్​​ నటరాజన్​కు చోటు కల్పించిన తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​(టీఎన్​సీఏ).. అతడి విషయంలో నిర్ణయం మార్చుకుంది. అతడిని విడుదల చేస్తునట్లు ప్రకటించింది.

ఇంగ్లాండ్​తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్​కు నట్టూ ఎంపికయ్యాడు. ఈ ఫార్మాట్​లో అతడిని పూర్తిస్థాయి ఫిట్​నెస్​, ఉత్సాహంతో బరిలో దింపాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ కారణంగానే నట్టూను విడుదల చేస్తునట్లు టీఎన్​సీఏ తెలిపింది.

బీసీసీఐకి వినతి

ఇంగ్లాండ్​తో జరగుతున్న తొలి రెండు టెస్టులకు భారత జట్టులో యువ లెఫ్ట్​ ఆర్మ్​ పేసర్ నట్టూ​కు స్థానం కల్పించలేదు యాజమాన్యం. దీంతో తమిళనాడు జట్టులో చోటు కల్పించింది టీఎన్​సీఏ. అయితే అతడిని తుది జట్టులో ఆడించే విషయమై బీసీసీఐ అనుమతి కోరింది. స్పందించిన బీసీసీఐ.. నట్టూ ఫిట్​నెస్​తో ఉండటం ముఖ్యమని తమతో చెప్పినట్లు టీఎన్​సీఏ వెల్లడించింది.

ఈ టోర్నీలో తమ జట్టుకు భారత సీనియర్​ ప్లేయర్​ దినేశ్​ కార్తీక్​ను సారథిగా నియమించగా.. బాబా అపరాజిత్​కు వైస్​ కెప్టెన్సీ అప్పగించింది తమిళనాడు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 14వరకు జరగనున్న ఈ టోర్నీ సూరత్​, ఇండోర్​, బెంగళూరు, జైపుర్​, కోల్​కతా, చెన్నైలో జరగనుంది.

ఇదీ చూడండి: హజారే ట్రోఫీ తమిళనాడు జట్టులో నట్టూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.