ETV Bharat / sports

సచిన్​.. ఈ రికార్డును బ్రేక్ చేయ్: యువరాజ్ - నా 'వంటింట్లో వంద' రికార్డు

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్​ సింగ్​.. దిగ్గజ క్రికెటర్​ సచిన్​కు తన రికార్డు బ్రేక్​ చేయాలంటూ మరో కొత్త ఛాలెంజ్​ను విసిరాడు. అప్పడాల కర్రతో టెన్నిస్​ బంతిని కింద పడకుండా కొడుతూ వీడియోలో కనిపించాడు యువీ.

sachin
సచిన్​
author img

By

Published : May 31, 2020, 4:51 PM IST

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్ యువరాజ్​ సింగ్.. వరుస ఛాలెంజ్​లతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల 'కీప్​ ఇట్​ అప్​' అనే ఛాలెంజ్​ను ప్రారంభించి దీన్ని కొనసాగించండి అంటూ సచిన్​, రోహిత్​, హర్భజన్​ సహా పలువురిని నామినేట్​ చేశాడు. అయితే ఈ ఛాలెంజ్​ను కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు సచిన్​.

అయితే తాజాగా 'వంటింట్లో వంద' పేరిట మరో కొత్త ఛాలెంజ్​తో తెరపైకి వచ్చాడు యువీ. దీనికి సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు. ఇందులో కళ్లకు గంతలు కట్టుకొని అప్పడాల కర్రతో టెన్నిస్​ బంతి కిందపడకుండా కొడుతూ కనిపించాడు. సచిన్​ కూడా ఇదే విధంగా చేయాలంటూ సవాల్​ విసిరాడు.

"మాస్టర్‌ ఇప్పటివరకు మైదానంలో మీరు ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఈసారి "నా 'వంటింట్లో వంద''' రికార్డును బ్రేక్‌ చేయండి. అంతేగానీ వంటింట్లోని మిగతా సామాగ్రిని పగలగొట్టకండి. నేను పూర్తి చేసిన ఛాలెంజ్‌కు సంబంధించి ఫుల్‌ వీడియోను నిడివి కారణంగా పోస్ట్‌ చేయలేకపోతున్నా" అంటూ యువీ వ్యాఖ్య జోడించాడు. ప్రస్తుతం ఈ ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదీ చూడండి : 'విరాట్​ కోహ్లీ క్రికెటర్ కాదు మోడల్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.