ETV Bharat / sports

ఈసారైనా వీళ్ల ముచ్చట తీరేనా? - delhi capitals

దిగ్గజాలతో బరిలో దిగుతుంది ఓ జట్టు, హార్డ్​ హిట్టర్లతో దూసుకొస్తోంది మరో జట్టు, బ్యాట్స్​మెన్, బౌలర్లతో సమతూకంగా ఉంది ఇంకో జట్టు. ఒక్క సారి కుడా ఐపీఎల్ ట్రోఫీ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, దిల్లీ క్యాపిటల్స్ జట్లు ఈ సారి టైటిల్​పై కన్నేశాయి.

ఐపీఎల్
author img

By

Published : Mar 19, 2019, 7:13 PM IST

Updated : Mar 19, 2019, 9:08 PM IST

ఐపీఎల్... ఈ పేరు వింటే క్రికెట్ అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతారు. సిక్సర్ల మోతలు, బౌండరీల బాదుడు, చీర్​గర్ల్స్ చిందులతో స్టేడియం హోరెత్తుతుంది. 2008లో ప్రారంభమైన ఈ పొట్టి క్రికెట్​ టైటిల్​ను చెన్నై, ముంబయి చెరో మూడు సార్లు, హైదరాబాద్ (దక్కన్ ఛార్జర్స్, సన్​రైజర్స్), కోల్​కతా చెరో రెండు సార్లు ముద్దాడగా రాజస్థాన్ రాయల్స్ ఓ సారి గెలిచింది. బెంగళూరు, దిల్లీ, కింగ్స్​లెవన్ పంజాబ్ ఒక్క సారి కూడా విజేతలు కాలేకపోయాయి.. మరి ఈసారైనా గెలుస్తారో లేదో చూడాలి.

ఛాలెంజర్స్... సవాల్ విసురుతారా
విరాట్​ కోహ్లీ, క్రిస్ గేల్, డివిలియర్స్, స్టార్క్ లాంటి అద్భుత ఆటగాళ్లున్న రాయల్​ ఛాలెంజర్స్.. ఒక్కసారి కూడా విజేత కాలేకపోయింది. గతేడాది క్రిస్​గేల్​ని పంజాబ్ సొంతం చేసుకుంది. 2009, 2011, 2016 టోర్నీల్లో మూడు సార్లు ఫైనల్​కి వెళ్లి రన్నరప్​తో సరిపెట్టుకుంది. దిగ్గజాలకు కొదవలేకున్నా ఈ జట్టును దురదృష్టం వెంటాడుతోంది . ప్రమాదకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ బౌలింగ్​లో వెనుకంజలో వేస్తోంది. కెప్టెన్ ​కోహ్లీ సారథ్యంలో సమర్థంగా ఆడుతున్నా కీలక మ్యాచ్​లలో చేతులెత్తేస్తోందీ జట్టు. విరాట్​, డివిలియర్స్, హెట్మైర్, మొయిన్​ అలీ, స్టాయినీస్, గ్రాండ్​ హోమ్​ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఈ సారి ఎలాగైనా టైటిల్​ సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ds
బెంగళూరు ఆటగాళ్లు

కింగ్స్​ ఎలెవన్ .. కింగ్ అవుతుందా
ఐపీఎల్ ప్రారంభం నుంచి టైటిల్​ గెలవాలనే కసితో ఉంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. 2008లో సెమీఫైనల్​ వరకు చేరగా, 2014లో రన్నరప్​తో సరిపెట్టుకుంది. ఈ రెండు సార్లు మినహా మిగతా అన్ని సార్లు ప్లే ఆఫ్స్​కీ చేరలేకపోయింది. గతేడాది క్రిస్ గేల్ ఈ టీమ్​లో చేరినా అదృష్టం వరించలేదు. దాదాపు ప్రతి సీజన్​కీ కెప్టెన్​లను, కోచ్​లను మారుస్తున్నా.. టైటిల్​ అందని ద్రాక్షలానే మిగిలింది. ఇప్పటివరకు 11 మంది కెప్టెన్లు మారారు. రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, క్రిస్​గేల్, డేవిడ్ మిల్లర్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. మయాంక్​ అగర్వాల్, కరుణ్ నాయర్, మహ్మద్ షమీ, మన్​దీప్ సింగ్ లాంటి దేశవాళీ ఆటగాళ్లతో ఈసారి బరిలోకి దిగుతోంది. పంజాబ్ జట్టు అనగానే గుర్తొచ్చేది ప్రీతి జింతా. ఫ్రాంఛైజీ యజమానైప్పటికీ దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతుంది.

ds
పంజాబ్ యాజమాన్యం

క్యాపిటల్​ జట్టు కేక పుట్టిస్తుందా...
ఐపీఎల్ జట్లన్నింటిలోనూ అంతగా కలిసిరాని జట్టు ఏదైనా ఉందంటే అది దిల్లీనే. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్​కి కూడా చేరలేకపోయింది. 2008,2009లలో సెమీస్ వరకు రాగా, 2012లో ప్లే ఆఫ్స్​కే పరిమితమైంది. ఈసారి టైటిల్​పై​ గురిపెట్టిన జట్లలో ముందున్న జట్టు దిల్లీ. ఫ్రాంఛైజీ పేరుతో సహా చాలా మంది క్రీడాకారుల్ని మార్చింది. ప్రసుత్తం శిఖర్ ధావన్, కొలిన్​ మున్రో, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, పంత్ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్​మెన్​ ఉన్నారు. బౌలింగ్​లో బౌల్ట్, రబాడా, ఇషాంత్ శర్మ, అమిత్​ మిశ్రాలతో బలంగా ఉంది. క్రిస్​మోరిస్, అక్షర్ పటేల్ లాంటి ఆల్​రౌండర్లతో జట్టు సమతూకంగా ఉంది. గతేడాది వరకు డేర్​డెవిల్స్​గా ఉన్న పేరును ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్​గా మార్చి నూతనోత్సాహంతో బరిలో దిగనుంది దిల్లీ. రికీ పాంటింగ్ కోచ్​గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ds
దిల్లీ క్యాపిటల్స్ జట్టు

ఇవీ చూడండి..ఎన్నికల తేదీల్లోనూ ఐపీఎల్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Christchurch, New Zealand - March 18, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of Gun City
2. Various of David Tipple, owner of Gun City, speaking at press conference
3. Reporters, camera crews at press conference
4. Various of Gun City store in retail park
Christchurch, New Zealand - March 17, 2019 (CGTN - No access Chinese mainland)
5. Various of people laying flowers to mourn terror attack's victims
6. Various of people weeping
Christchurch, New Zealand - March 17, 2019 (CCTV - No access Chinese mainland)
7. Various of police officers, police car, police cordons
8. Investigation team on street
New Zealand's largest gun dealer, Gun City, confirmed on Monday that four of the five firearms used during the Christchurch mass shootings were purchased legally from the company.
David Tipple, owner of Gun City, which brands itself as the 'world's largest gun store', confirmed in a press conference that suspect Brenton Tarrant purchased the four guns online, but said the other semi-automatic firearm used in the killing spree was not obtained from them.
Tipple said the suspect held a legitimate A-class gun license when he made the purchase.
He refused to enter into discussions concerning the country’s gun laws during the press conference, insisting that Gun City did nothing wrong in selling firearms to the suspect. Prime Minister Jacinda Ardern has faced calls to reform gun legislation in New Zealand in the wake of the tragedy.
At least 50 people were killed and 50 others seriously injured during the shootings at two mosques in Christchurch on Friday, an attack which has shocked the nation.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Mar 19, 2019, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.