విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది భారత జట్టు. ఇందులో గెలిచిన టీమిండియా 40 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఫలితంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానాన్ని పదిలపరుచుకుంది. ఐసీసీ ఈ ఏడాది నుంచి నూతనంగా ప్రవేశపెట్టిన ఈ ఛాంపియన్‌షిప్‌లో... ప్రతి సిరీస్‌కి 120 పాయింట్లను కేటాయిస్తారు. ఇందులో మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా వాటిని విభజిస్తారు.
-
Shami takes the final wicket – his fifth of the innings – and closes out a big win for India. That's 40 more ICC World Test Championship points in their kitty!#INDvSA SCORECARD 👇https://t.co/dCGJ4Pcug5 pic.twitter.com/HlTk4dU3Kz
— ICC (@ICC) October 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shami takes the final wicket – his fifth of the innings – and closes out a big win for India. That's 40 more ICC World Test Championship points in their kitty!#INDvSA SCORECARD 👇https://t.co/dCGJ4Pcug5 pic.twitter.com/HlTk4dU3Kz
— ICC (@ICC) October 6, 2019Shami takes the final wicket – his fifth of the innings – and closes out a big win for India. That's 40 more ICC World Test Championship points in their kitty!#INDvSA SCORECARD 👇https://t.co/dCGJ4Pcug5 pic.twitter.com/HlTk4dU3Kz
— ICC (@ICC) October 6, 2019
దూసుకెళ్తోన్న కోహ్లీసేన...
ఛాంపియన్‌షిప్ ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభమవగా.. ఇటీవల వెస్టిండీస్‌తో జిరిగిన రెండు టెస్టుల సిరీస్‌ని 2-0తో గెలుపొందింది భారత జట్టు. అప్పుడు 120 పాయింట్లతో జాబితాలో తొలిస్థానం దక్కించుకుంది టీమిండియా. తాజాగా సఫారీలపై గెలిచిన కోహ్లీసేన మరో 40 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 160 పాయింట్లలో నెం.1 స్థానంలోనే కొనసాగుతోంది భారత జట్టు. తర్వాత న్యూజిలాండ్ (60 పాయింట్లు), శ్రీలంక (60), ఆస్ట్రేలియా (56), ఇంగ్లాండ్ (56) టాప్-5లో చోటు దక్కించుకున్నాయి.
ఛాంపియన్‌షిప్ ప్రారంభమైన తర్వాత తాజాగా తొలి టెస్టు మ్యాచ్ ఆడిన దక్షిణాఫ్రికా... పరాజయంతో ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. సఫారీ జట్టుతో పాటు పాకిస్థాన్, విండీస్ కూడా పాయింట్లు సంపాదించలేకపోయాయి.
ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కలిపి తొమ్మిది దేశాలు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టూ సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశాల్లో మూడు సిరీస్‌లు ఆడనుంది. మొత్తంగా 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. రెండేళ్ల ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరిగా టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్లో పోటీపడతాయి. 2021 జూన్ నెలలో ఈ తుది సమరం జరగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టెస్టు ఛాంపియన్‌గా అవతరిస్తుంది.
ఇదీ చదవండి...