ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ.. పదవీకాలం దాటి ఎవరూ కొనసాగలేరని పేర్కొన్నాడు. బోర్డు 88వ వార్షిక సర్వసభ్య సమావేశంలో దాదా ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఎమ్మెస్కే ప్రసాద్ ప్యానెల్ పదవీవిరమణ విషయంలో బీసీసీఐ పాత రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విధానంలో గరిష్టంగా ఐదేళ్ల కాలపరిమితి ఉంది. గతంలో ఇది నాలుగేళ్ల వరకు ఉండేది.
ఈ కమిటీలోని సభ్యులుగా ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడా 2015లో చేరారు. జతిన్ పరంజ్పే, శరణ్‌దీప్ సింగ్, దేవాంగ్ గాంధీలు 2016లో ప్యానెల్లో కలిశారు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం సభ్యులంతా ఇకపై కొనసాగలేరని గంగూలీ స్పష్టం చేశాడు. వారు మంచి సేవలందించారని అన్నాడు.
అయితే ఈ ఐదుగురు సభ్యుల ప్యానెల్ హయాంలో టీమిండియా అద్భుతంగా రాణించింది. అదే సమయంలో కమిటీ సభ్యుల వ్యక్తిగత కెరీర్ గురించి ట్రోలింగ్స్ జరిగాయి.
ఇది చదవండి: లారా రికార్డు బ్రేక్ చేయాలంటే అతడికే సాధ్యం: డేవిడ్ వార్నర్