ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ-ట్వంటీలో భారత బ్యాట్స్ఉమెన్ తడబడ్డారు. టాప్ఆర్డర్ విఫలమైన వేళ టీమిండియా 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 111 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ స్మృతి మంధానా 12 పరుగులకు వెనుదిరిగిన తర్వాత.... మిగతా బ్యాటర్లు వరసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేథరిన్ బ్రంట్ మూడు వికెట్లతో రాణించగా, లిన్సే స్మిత్ రెండు వికెట్ల తీసి టీమిండియాను దెబ్బతీసింది.
మిథాలీ రాజ్(20), దీప్తి శర్మ కాసేపు నిలకడగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. హర్లీన్ డియోల్(14), రోడ్రిగ్స్(2) వేగంగా పరుగుల చేయలేకపోయారు. ఇంగ్లీష్ జట్టు వరుసగా వికెట్లు తీస్తూ భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది.
స్మృతి మంధానా, రోడ్రిగ్స్ వికెట్లు తీసి భారత జట్టును దెబ్బతీసింది కేథరిన్ బ్రంట్.