భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే(86) సోమవారం ఉదయం మరణించారు. అనారోగ్యం కారణంగా ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరిన ఆయన ఉదయం కన్నుమూసినట్లు కుమారుడు వామన్ మీడియాకు తెలిపారు. టెస్టుల్లో ఓపెనర్‌గా ఏడు మ్యాచ్‌లు ఆడారు మాధవ్. 13 ఇన్నింగ్స్‌ల్లో 542 పరుగులు చేశారు.
1952-53 సీజన్లో పాకిస్థాన్‌పై తొలిసారి టెస్టు సిరీస్‌కు ఎంపికై మంచి ప్రదర్శన చేశారు. అనంతరం 1953లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన మాధవ్ ఓవల్‌లో జరిగిన టెస్టులో భారీ శతకంతో ఆకట్టుకున్నారు. 163 పరుగులు చేసి భారత్‌ను ఓటమి నుంచి తప్పించారు. 1989లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేసిన ఈ దిగ్గజ బ్యాట్స్‌మన్ క్రికెట్ ఆడేందుకు సచిన్‌కు మెంబర్షిప్ ఇచ్చారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 67 మ్యాచ్‌లు ఆడిన మాధవ్.. 102 ఇన్నింగ్స్‌ల్లో 3,336 పరుగులు చేశారు. ఇందులో ఆరు శతకాలు, 16 అర్ధసెంచరీలు ఉన్నాయి. 1951-52 సీజన్లో ముంబయి తరఫున రంజీలో అరంగేట్రం చేసి.. తొలి మ్యాచ్‌లోనే సౌరాష్ట్రపై శతకం బాది గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇదీ చదవండి: 'పంత్‌ను లోయర్ ఆర్డర్లో పంపించాలి'