ETV Bharat / sports

కష్టాల్లో ఇంగ్లాండ్​- 'టీ'​ విరామానికి 81/4 - tea break in third test

పింక్ టెస్టులో ఇంగ్లాండ్​ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న రూట్​ సేన టీ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో పోప్​, స్టోక్స్​ ఉన్నారు. అక్షర్​ పటేల్​ రెండు వికెట్లు తీయగా.. ఇషాంత్​, అశ్విన్​ తలో వికెట్ తీశారు.

tea break in third test
పింక్​ టెస్టు: టీ​ సమయానికి 81/4తో ఇంగ్లాండ్​
author img

By

Published : Feb 24, 2021, 4:39 PM IST

పింక్​ టెస్టులో మొతెరా పిచ్ స్పిన్​కు సహకరిస్తుంది. దీంతో టీ విరామ సమయానికి ఇంగ్లాండ్​ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో పోప్​(1), స్టోక్స్​(6) ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్​ పటేల్​ రెండు వికెట్లు తీయగా.. ఇషాంత్​, అశ్విన్​ తలో వికెట్ పడగొట్టారు.

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లాండ్​ను వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్​ శర్మ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్​ డామ్​ సిబ్లీని స్లిప్​లో దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే జానీ బెయిర్​ స్టోను.. అక్షర్​ పటేల్ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఇక మూడో వికెట్​కు 47 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న రూట్​, క్రావ్లే జంటను అశ్విన్​ విడదీశాడు. రూట్​ వికెట్ల ముందు దొరికిపోయాడు. అర్ధ సెంచరీ చేసి ఊపుమీదున్న జాక్​ క్రావ్లేను అక్షర్​ పెవిలియన్​ పంపాడు. ​

ఇదీ చదవండి: సచిన్​కు సలామ్​.. చరిత్ర మొదలై నేటికి 11 ఏళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.