అంబటి రాయుడు 113 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లతో 90 పరుగులు చేసి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. కేదార్ జాదవ్ 45 బంతుల్లో 3పోర్లతో 34 పరుగులు చేసి రాయుడుకు సహకారం అందించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా సిక్సర్లతో విరుచుకుపడి 22 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు.
రాయుడు హాఫ్ సెంచరీ
అంబటి రాయుడు క్రీజులో కుదరుకునే వరకు నెమ్మదిగా ఆడాడు. అ తర్వాత కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం బ్యాటింగ్ జోరు పెంచాడు. తృటిలో శతకం చేజార్చుకున్న రాయుడు హెన్రీ బౌలింగ్లో మున్రోకు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు.
మూడు ఓవర్లు-మూడు వికెట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వలేకపోయారు. మొదటి రెండు ఓవర్లలో స్కోరు ఖాతా తెరవలేదు. రెండు పరుగులు చేసిన రోహిత్ ఐదో ఓవర్లో హెన్రీ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లలోనే ధావన్(6)ను బౌల్ట్ ఔట్ చేశాడు. 7 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ను ఏడో ఓవర్లో హెన్రీ పెవిలియన్కు చేర్చాడు. దీంతో వరుసగా మూడు ఓవర్లరో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.
ఒక్క పరుగుకే ధోని ఔట్
17 పరుగులకే మూడు వికెట్ల నష్టంతో క్లిష్ట స్థితిలో ఉన్న టీమిండియాను మిస్టర్ కూల్ ధోని ఆదుకోలేకపోయాడు. ఒక్క పరుగు చేసిన ధోనీని క్లీన్ బౌల్డ్ చేశాడు బౌల్ట్.