ETV Bharat / sports

ముస్తాక్ అలీ ఫైనల్లో తమిళనాడు X బరోడా - పంజాబ్

దేశవాళీ టోర్నీ సయ్యద్​ ముస్తాక్​ అలీ టీ20 రెండో సెమీఫైనల్లో పంజాబ్​పై బరోడా గెలిచింది. జనవరి 31న జరిగే ఫైనల్లో తమిళనాడుతో అమీతుమీ తేల్చుకోనుంది.

Syed Mushtaq Ali Trophy : Tamil Nadu, Baroda enters finals
సయ్యద్​ ముస్తాక్ అలీ ట్రోఫీ: ఫైనల్​కు తమిళనాడు, బరోడా
author img

By

Published : Jan 29, 2021, 11:11 PM IST

సయ్యద్​ ముస్తాక్​ అలీ టైటిల్​ కోసం తమిళనాడు, బరోడా జట్లు తలపడనున్నాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీస్​లో రాజస్థాన్​పై 7 వికెట్ల తేడాతో గెలిచింది తమిళనాడు. 89 పరుగులు చేసి ఆ జట్టుకు అద్వితీయ గెలుపును అందించాడు అరుణ్ కార్తీక్. తొలుత టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెప్టెన్ అశోక్ మెనారియా(51), ఏఆర్​ గుప్తా(45) రాణించారు. తమిళనాడు బౌలర్లు మహ్మద్ 4, సాయి కిశోర్​ 2 వికెట్లు తీసి రాజస్థాన్​ను కట్టడి చేశారు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన తమిళనాడు ఓ దశలో 17/2 వద్ద నిలిచింది. అయితే జగదీశన్(28)​తో కలిసి అరుణ్​(89*) ఇన్నింగ్స్​ను చక్కబెట్టాడు. ఆ తర్వాత జగదీశన్​ను రవి బిష్ణోయ్ బోల్తా కొట్టించగా సారథి దినేశ్ కార్తీక్(26*)​తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు అరుణ్.

రెండో సెమీఫైనల్​​లో పంజాబ్​పై 25 పరుగుల తేడాతో గెలిచింది బరోడా. టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన బరోడా.. కేదార్​ దేవ్​ధర్​ (64), కేఆర్​ కాకడే(53) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​.. వెంటవెంటనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. గుర్​కీరత్ మన్​(39), మన్​దీప్​ సింగ్(42)​ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే మెరివాలా (3 వికెట్లు) ధాటికి 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్​.

తమిళనాడు, బరోడా జట్లు జనవరి 31న జరిగే ఫైనల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్​ కూడా అహ్మదాబాద్​లోని సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ స్టేడియంలోనే జరగనుంది.

ఇదీ చూడండి: భారత్​-ఇంగ్లాండ్​ సిరీస్​.. టాప్​-3లో ఎవరు బెస్ట్​?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.