ETV Bharat / sports

నేటి తరం యువకులకు అతడొక రోల్​ మోడల్: లక్ష్మణ్​ - లక్ష్మణ్

ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​కు జట్టులో చోటు దక్కించుకున్న సూర్యకుమార్​ యాదవ్​ను ప్రశంసించాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్​ లక్ష్మణ్​. నేటి తరం యువకులకు అతడొక రోల్​ మోడల్​ అని అభిప్రాయపడ్డాడు.

Suryakumar Yadav, perfect role model for youngsters, says Laxman
నేటి తరం యువకులకు అతడొక రోల్​ మోడల్: లక్ష్మణ్​
author img

By

Published : Mar 9, 2021, 2:11 PM IST

టీమ్​ఇండియా యువ బ్యాట్స్​మన్​​ సూర్యకుమార్ యాదవ్​పై ప్రశంసల జల్లు కురిపించాడు భారత మాజీ క్రికెటర్​​ వీవీఎస్​ లక్ష్మణ్​. "ఈ తరం యువకులకు (ముఖ్యంగా భారత యువకులకు) అతడొక రోల్​ మోడల్​" అని కొనియాడాడు.

"ఈ తరం యువకులకు అతడు (సూర్య కుమార్​ యాదవ్​) ఒక రోల్​ మోడల్​. ప్రతిభ ఉన్నప్పటికీ.. భారత జట్టులో చోటు కోసం సుదీర్ఘ కాలం వేచి చూశాడు. చివరికి ఫలితం పొందాడు. ఇంతగా వేచి చూసే ఓపిక వేరొకరికి ఉండదేమో. టీమ్​ఇండియాకు ఎంపిక కాకపోవడం వల్ల అతడు నిరాశ చెందలేదు. తిరిగి ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​లో అడుగుపెట్టి తానేంటో నిరూపించుకున్నాడు. ముంబయి ఇండియన్స్​ తరఫున రాణించాడు."

-వీవీఎస్​ లక్ష్మణ్​, భారత మాజీ క్రికెటర్.

సూర్య ఆడిన మ్యాచ్​లు దాదాపు కఠిన పరిస్థితుల్లో ఆడినవేనని లక్ష్మణ్​ అభిప్రాయపడ్డాడు. ముంబయికి ఎన్నో సందర్భాల్లో విజయాలను అందించాడని తెలిపాడు. "సెలెక్టర్లు నీకు మొండిచెయ్యి చూపిస్తే నీ ప్రదర్శనతోనే వారు ఎంపిక చేసేటట్లు నిరూపించుకోమని మా కోచ్​ చెప్పేవారు. ఇప్పుడు సూర్యను చూస్తుంటే ఆ మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇంగ్లాండ్​తో టీ20లకు తుది జట్టులో అతనికి చోటు దక్కుతుందో లేదో తెలీదు. కానీ అందుకు అతడు పూర్తిగా అర్హుడు" అని లక్ష్మణ్​ వెల్లడించాడు.

సూర్యకుమార్​ యాదవ్​.. దేశవాళీ క్రికెట్​లో, ఐపీఎల్​​లో స్థిరంగా రాణిస్తున్నాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియాతో సిరీస్​లో అతడిని జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై చాలా మంది బహిరంగంగానే ప్రశ్నించారు. దీంతో ఇంగ్లాండ్​తో టీ20లకు అతన్ని ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ.

ఇదీ చదవండి: 'మొతేరాలో వేడి తట్టుకోలేకపోయా.. 5 కేజీల బరువు తగ్గా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.