ETV Bharat / sports

సచిన్ వల్లే ఆ పచ్చబొట్టు వేసుకున్నా: రైనా - 2014 ఇంగ్లాండ్ పర్యటన సురేశ్ రైనా

సురేశ్ రైనా కుడి చేతిపై ఓ టాటూ ఉంటుంది. అది వేసుకోవడానికి కారణం దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ అని వెల్లడించాడు రైనా.

suresh raina reveals reason behind his tattoo
సచిన్ వల్లే ఆ పచ్చబొట్టు వేసుకున్నా: రైనా
author img

By

Published : Jan 5, 2021, 9:08 AM IST

టీమ్​ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా కుడి చేతి మీద "నమ్మకం (బిలీవ్)" అనే పచ్చబొట్టు ఉంటుంది. దీన్ని అతను 2014లో వేయించుకున్నాడు. అయితే ఆ పచ్చబొట్టు వేసుకోవడానికి గల కారణాన్ని అతడు ఇటీవల బయటపెట్టాడు.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ స్ఫూర్తితోనే అది వేయించుకున్నట్లు వెల్లడించాడు రైనా. 2013లోనే సచిన్ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఆ తర్వాత అతనితో రైనా తన అనుబంధాన్ని కొనాసాగించాడు. 2017 ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ముంబయిలోని సచిన్ నివాసానికి దగ్గర్లో అతని ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నట్లు రైనా తెలిపాడు.

ఆ సమయంలో సచిన్.. "నిన్ను నువ్వు నమ్మాలి. అలా నమ్మితే నువ్వు అద్భుతాలు చేయగలవు" అని తనతో చెప్పాడని రైనా అన్నాడు. ఆ స్ఫూర్తితోనే ఆ పదాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నట్లు తెలిపాడు.

ఇదీ చూడండి: 'టోక్యోలో భారత్​ అత్యుత్తమ ప్రదర్శన చేస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.