టీమ్‌ఇండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి 15 ఏళ్లు. ఈ సందర్భంగా అతడి జీవిత భాగస్వామి ప్రియాంకా చౌదరి సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆటపై రైనాకు ఉన్న అంకిత భావం, ప్రేమ, కెరీర్‌లో నిలదొక్కుకొనేందుకు పడ్డ శ్రమను వివరించారు.
"నువ్వు తొలి వన్డే ఆడి పదిహేను సంవత్సరాలు గడిచింది! ఈ 15 ఏళ్లలో ఎన్నో విజయాలు అందుకున్నావు. ఎంతో కష్టపడ్డావు. ఎన్నో ఒడుదొడుకులూ ఎదుర్కొన్నావు. నీ అభిరుచి, నీ అంతకితభావం, నీకు లభించిన ఫలితాల్ని ఈ ప్రపంచం వీక్షించింది. నీ శ్రమ, నీ పిచ్చి, నువ్వు నిద్రపోని రాత్రులు, కొన్నింటికి నువ్వు పడ్డ బాధను నేను చూశా. ఆట కోసం నువ్వెంత తపనపడ్డావో గమనించా. తిరిగి నీ ఆటను నువ్వు అందుకొనేందుకు పడ్డ ఆవేదన, శ్రమ, నీకు అండగా నిలిచిన వారిని చూశా."
-ప్రియాంకా చౌదరి, రైనా సతీమణి
"ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాన్ని నువ్వు ఆశీర్వాదంగా భావించావు. వారి అంచనాలను అందుకొనేందుకు అత్యుత్తమంగా ఆడేందుకు నిరంతరం కృషి చేశావు. అయితే ప్రతిసారీ ఎవ్వరూ పరిపూర్ణంగా ఉండలేరు. నీ వంతుగా కృషి చేసేందుకు సహనంతో నిలిచావు. విమర్శలు ఎదురైనప్పుడు ప్రశాంతంగా నువ్వు జవాబిచ్చిన తీరును నేను అభినందిస్తాను. నిన్ను చూసి నేనెప్పుడూ గర్వపడతాను. నువ్వెన్నో ఘనతలు సాధించావు. ఇంకెన్నో ఘనతలకు అర్హుడివి కూడా. ఎప్పుడూ మనస్ఫూర్తిగా అభినందించే హృదయం నీది. నువ్వలాగే ఉండాలి. మరింత కష్టపడు. మరింత జ్వలించు. అపరిమితంగా కృషి చేయి. మిగతాదంతా నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. నిన్నెప్పుడూ మేం ప్రేమిస్తూనే ఉంటాం. నువ్వు సాధించిందానికి గర్వపడుతుంటాం. ప్రేమతో రియో, గ్రేసియా, ప్రియాంక" అని రైనా సతీమణి సందేశం రాశారు.
-
We love you @ImRaina & are super proud of everything you have done.
— Priyanka Chaudhary Raina (@PriyankaCRaina) July 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Love, Rio, Gracia & Priyanka #15yearsofraina pic.twitter.com/rrcqbpF7OA
">We love you @ImRaina & are super proud of everything you have done.
— Priyanka Chaudhary Raina (@PriyankaCRaina) July 30, 2020
Love, Rio, Gracia & Priyanka #15yearsofraina pic.twitter.com/rrcqbpF7OAWe love you @ImRaina & are super proud of everything you have done.
— Priyanka Chaudhary Raina (@PriyankaCRaina) July 30, 2020
Love, Rio, Gracia & Priyanka #15yearsofraina pic.twitter.com/rrcqbpF7OA
దంబుల్లా వేదికగా 2005, జులై 30న శ్రీలంకపై వన్డేల్లో రైనా అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఎన్నో పరుగులు సాధించాడు. కెరీర్‌లో చిరస్మరణీయ ఘనతలు అందుకున్నాడు. తన అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో అబ్బురపరిచాడు. 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని రైనా అందుకోవడం గమనార్హం. ఇప్పటి వరకు 226 వన్డేల్లో 5,616 పరుగులు చేశాడు.78 టీ20లు, 18 టెస్టులు ఆడాడు. 2018 నుంచి అతడు జట్టులోకి ఎంపికవ్వలేదు. ప్రస్తుతం ఐపీఎల్, దేశవాళీనే నమ్ముకున్నాడు.